Latest NewsTelangana

three people died in severe accident in surypeta district | Suryapeta News: సూర్యాపేట జిల్లాలో ఘోర ప్రమాదం


Three People Died in Accident in Suryapeta District: సూర్యాపేట జిల్లాలో బుధవారం ఉదయం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మోతె సమీపంలో ఆటో, బస్సు ఢీకొన్న ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో 9 మంది గాయపడ్డారు. ప్రమాద సమయంలో ఆటోలో 12 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదం గమనించిన వెంటనే స్థానికులు క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదానికి సంబంధించి వివరాలు సేకరించారు. మృతులు మునగాల మండలం రామసముద్ర వాసులుగా గుర్తించారు. మోతె మండలం బుర్కచర్లలో మిరప తోటలో పనులకు వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలిపారు.

చెట్టును ఢీకొన్న బైక్

అలాగే, మరోవైపు కామారెడ్డి జిల్లా పిట్లం మండలం అన్నారం కలాన్ సమీపంలో చెట్టును బైక్ ఢీకొని ఇద్దరి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాలను పరిశీలించారు. మృతులు సిద్ధాపూర్ తండాకు చెందిన కిషన్, సవాయి సింగ్ లుగా గుర్తించారు. వారు వివాహానికి వెళ్లి వస్తుండగా ఈ ఘటన జరిగినట్లు స్థానికులు తెలిపారు.

Also Read: Dastagiri News: పులివెందులలో జగన్‌పై పోటీ చేస్తా – దస్తగిరి, భద్రత కోసం తెలంగాణ సీఎంకు వినతి

 

 

 

 

 

 

మరిన్ని చూడండి



Source link

Related posts

Opinion: తెలంగాణ కమలం పగటి కలలు కంటోందా?

Oknews

Bandi Sanjay participates in Vijaya sankalp yatra in Tandur of Vikarabad district | Bandi Sanjay: బీఆర్ఎస్‌తో బీజేపీ పొత్తు అంటే చెప్పుతో కొట్టండి

Oknews

Gold Silver Prices Today 28 February 2024 know rates in your city Telangana Hyderabad Andhra Pradesh Amaravati | Gold-Silver Prices Today: స్థిరంగా పసిడి ప్రకాశం, మెత్తబడ్డ వెండి

Oknews

Leave a Comment