Andhra Pradesh

Tirumala : ఫిబ్రవరి 16న తిరుమలలో ర‌థ‌స‌ప్త‌మి


తిరుపతి శ్రీ కోదండ రామాలయంలో ఫిబ్రవరి నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. ఫిబ్రవరిలో 3, 10, 17, 24వ తేదీల్లో శనివారం సందర్భంగా ఉదయం 6 గంటలకు శ్రీ సీతారామ లక్ష్మణుల మూలవర్లకు అభిషేకం నిర్వహిస్తారు. సాయంత్రం 5.30 గంటలకు ఊంజల్‌సేవ, తిరువీధి ఉత్సవం, ఆస్థానం నిర్వహిస్తారు. ఫిబ్రవరి 9న అమావాస్య సందర్భంగా ఉదయం 8 గంటలకు సహస్ర కలశాభిషేకం చేపడతారు. రాత్రి 7 గంటలకు హనుమంత వాహనసేవ జరుగనుంది. ఫిబ్రవరి 21వ తేదీ పునర్వసు నక్షత్రం సందర్భంగా ఉదయం 11 గంటలకు శ్రీ సీతారాముల కల్యాణం జరుగనుంది. సాయంత్రం 5.30 గంటలకు స్వామి, అమ్మవారిని తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల గుండా శ్రీరామచంద్ర పుష్కరిణి వద్దకు ఊరేగింపుగా తీసుకెళతారు. సాయంత్రం 5.30 గంటలకు ఊంజల్‌సేవ, ఆస్థానం నిర్వహిస్తారు. ఫిబ్రవరి 25న పౌర్ణమి సందర్భంగా కూపుచంద్ర పేట ఉత్సవం నిర్వహించనున్నారు.



Source link

Related posts

AP Schools : 'నేను బడికి పోతా' ఏపీ ప్రభుత్వం వినూత్న కార్యక్రమం, జులై 12 లోపు బడి మానేసి పిల్లలు మళ్లీ బడికి

Oknews

Naralokesh In Inner Ringroad Case: ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో ఏ14గా నారాలోకేష్

Oknews

TTD Ugadi Calendar : శ్రీవారి భక్తులకు అలర్ట్… తొలిసారిగా ఉగాది తెలుగు క్యాలెండర్ ప్రచురించిన టీటీడీ – ఇలా కొనొచ్చు

Oknews

Leave a Comment