Health Care

Today's Horoscope : ఈరోజు రాశిఫలాలు


మేష రాశి : ఈరోజు ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఖర్చులు అధికం అవుతుంటాయి. విద్యార్థులకు కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. చాలా కాలంగా ఎవరైతే పెట్టుబడులు పెట్టాలని ఆలోచిస్తున్నారో వారికి నేడు కలిసి వస్తుంది. ఉద్యోగస్థులు నేడు కాస్త ఇబ్బందిగా ఫీలవుతారు. శ్రమకు తగిన ఫలితం ఉండదు.

వృషభ రాశి : ఈ రాశి విద్యార్థులు నేడు ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది. ఎవరైతే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారో వారికి ఈరోజు బెటర్‌గా ఉంటుంది. చిన్న పిల్లల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. స్టాక్ మార్కెట్‌కలో పెట్టుబడులు పెట్టే వారు ఆచీ తూచీ అడుగు వేయడం అవసరం.

మిథున రాశి : మీ శ్రీమతితో కుటుంబ సమస్యలు చర్చించండి. ఒకరికొకరు మీ విలువైన కాలాన్ని సన్నిహితంగా మసులుతూ మిమ్మల్ని మీరు ఆవిష్కరించుకొండి, ఆదర్శమైన జంట అనిపించుకొండి. ఇంట్లోని సానుకూల వైబ్రేషన్లను పిల్లలుకూడా అందుకుంటారు ఇంకా ఇంట్లో నెలకొన్న ఆహ్లాదకర మైన ప్రశాంతతను, సామరస్యతను అనుభవిస్తారు. ఇంటిపనులకు సంబంధించినవాటికొరకు మీరు మీజీవితభాగస్వామితో కలసి కొన్ని ఖరీదైనవస్తువులను కొంటారు.దీనిఫలితంగా మీకు ఆర్ధికంగా కొంత ఇబ్బందిగా ఉంటుంది. మీ కుటుంబ రహస్యం ఒకటి మిమ్మల్ని ఆశ్చర్య పరుస్తుంది. ప్రేమ హద్దులకు అతీతం. దానికి పరిమితుల్లేవు.

కర్కాటక రాశి : వ్యాపారం లాభసాటిగా జరుగును .రావలసిన బాకీలు వసూలు అగును. ఉద్యోగమునందు అనుకూలమైన మార్పులు.అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చేస్తారు. ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. వివాదాలు కేసులు అనుకూలంగా ఉండును.కుటుంబ సౌఖ్యం లభించును. విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

సింహ రాశి : మీ నాన్నగారు మిమ్మల్ని ఆస్తిలో వాటా వారసత్వంగా పొందకుండా చేయవచ్చును. కానీ క్రుంగిపోకండి. ఆస్తులు మనసును మొద్దుబారచేస్తాయి, కానీ అది అందకపోవడం దానిని బలోపేతం చేస్తుంది. రియల్ ఎస్టేట్ లపెట్టుబడి అత్యధిక లాభదాయకం. మీ పిల్లల సమస్యలు తీర్చడానికి కొంత సమయం కేటాయించండి. మీ శ్రీమతి తరఫు బంధువులు రాక ఆటంకం కలిగించడం వలన, మీ రోజు ప్లాన్ ఖరాబు అయిందని అప్ సెట్ అవుతారు. పోటీ రావడం వలన, పని తీరికలేకుండా ఉంటుంది. ఈరోజు మీరు ముఖ్యమైన విషయాలపై ధ్యాస పెట్టాలి. ఈ రోజు మీ జీవిత భాగస్వామి తాలూకు దుష్ప్రవర్తన మీపై బాగా ప్రభావం చూపవచ్చు.

కన్యరాశి : ఈరోజు మీకు మంచి జరుగుతుంది. మీరు మీ స్నేహితులు కలుస్తారు బయటికి పోయే ముందు పెద్దల ఆశీర్వాదం తీసుకోండి. ట్రేడింగ్ రంగంలో ఉన్నవారికి ఒడిదొడుకులు ఎదురవుతాయి. వృత్తి వ్యాపారము నందు ఆశించిన ధనలాభం కనబడదు. ఉద్యోగమునందు పై అధికారుల ఒత్తిడులు ఎక్కువగా ఉండను.

తుల రాశి : విద్యార్థులకు కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. కీలక మైన సమస్యలు మనుసును బాధపెడుతాయి. ముఖ్యమైన పనులు వాయిదా పడును. సంఘమునందు నిందారోపణలు ఏర్పడగలవు. ప్రయాణమునందు జాగ్రత్తలు పాటించవలెను. శారీరక శ్రమ పెరుగుతుంది. సంతానం తోటి విరోధాలు ఏర్పడవచ్చు.అకారణంగా కలహాలు ఏర్పడగలవు. మానసికంగా నిరుత్సాహంగా ఉండును. ఆరోగ్య సమస్యలు రావచ్చు. 

వృశ్చిక రాశి : ఆలయాలు సందర్శించడం ద్వారా బాధల నుంచి విముక్తి పొందుతారు. మీరే మీకు సమస్యలను సృష్టించుకొని ఇబ్బందుల్లో పడుతారు. ఇతరుల మీద ద్వేష అసూయలు రాగదు. అనుకోని ఖర్చులు పెరిగి ఆందోళనకు గురి అవుతారు. తల పెట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి.

ధనస్సు రాశి : ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రత్యర్ధులు పై పైచేయి సాధిస్తారు. మిత్రులతోటి కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారం నందు ఊహించిన ధన లాభం కలుగును. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. తలపెట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. కీలకమైన సమస్యలలో కుటుంబ వ్యక్తుల సహాయ సహకారాలు లభిస్తాయి.

మకర రాశి : నేడు ఈ రాశివారికి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. కానీ సమయానికి బంధువులు, స్నేహితుల సహాయంతో ఆ సమస్య నుంచి బయటపడగలరు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఈ రాశి వారికి నేడు సమాజంలో మంచి గౌరవ మర్యాదలు లాభిస్తాయి. ఎవరైతే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారో, వారికి నేడు కలిసి వస్తుంది.

కుంభ రాశి : ఈ రాశి వారికి నేడు సానుకూల ఫలితాలుంటాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో నెగ్గుకొస్తారు. అన్నింటా విజయం మీ సొంతం అవుతుంది. శుభకార్యాలయాల్లో పాల్గొంటారు. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. రియలెస్టేట్ రంగంలో ఉన్నవారు కాస్త ఆచీ తూచి అడుగు వేయడం మంచింది.

మీన రాశి : ఈరోజు పనులన్నీ మందకొండిగా సాగుతాయి. దైవదర్శనం మంచి ఫలితాలను ఇస్తుంది. చిన్నపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరం. నేడు ఈ రాశివారికి ఆర్థికంగా కలిసి వస్తుంది. పట్టిందల్లా బంగారమే కానుంది. ఆరోగ్యం విషయం లో జాగ్రత్త అవసరం.



Source link

Related posts

CS ప్రొఫెషనల్, ఎగ్జిక్యూటివ్ ఫలితాల విడుదల ఎప్పుడంటే..

Oknews

పడుకునే ముందు లైట్లు ఆర్పడం లేదా?.. ఈ ప్రమాదం పొంచి ఉన్నట్లే..

Oknews

బ్యాంకింగ్ మోసాలను అరికట్టేందుకు 'సర్జికల్ స్ట్రైక్', 1.4 లక్షల నకిలీ నంబర్లు బ్లాక్

Oknews

Leave a Comment