పవన్‌కు లెటర్ రాసిన ఐర్లాండ్ ఓడ కళాసి
జనసేన(Janasena) అధినేత పవన్‌కళ్యాణ్(Pawan Kalyan) తన సొంత పార్టీ విషయంలో ఎంతగా ఆలోచిస్తున్నారో అంతకంటే ఎక్కువగా ఆయన అభిమాను అంచనాలు పెట్టుకున్నారు. పార్టీని వారు ఆదరించడమే కాదు.. ఎనలేని అభిమానం సైతం పెంచుకున్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయం కోసం కూడా తపిస్తున్నారు. ఈ క్రమంలో ఎక్కడెక్కడి నుంచో జనసేన అభిమానులు స్పందిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. ప్రపంచ దేశాల్లో ఉన్న పలువురు పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా పార్టీ నిలదొక్కుకోవాలని.. పవన్ కళ్యాణ్‌పుంజుకోవాలని ఆశిస్తున్నారు. ఇంకా చదవండి
కోడికత్తి కేసు నిందితుడి విడుదల కోసం హర్షకుమార్ దీక్ష
కోడికత్తి కేసు నిందితుడు శ్రీను(Srinu)ను విడుదల చేయాలంటూ…అమలాపురం మాజీ ఎంపీ (Ex Mp)హర్షకుమార్ (Harsha Kumar)దీక్షకు దిగారు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలోని తన నివాసంలో హర్షకుమార్ నిరసన చేపట్టారు. దీక్షలో కోడికత్తి శ్రీను కుటుంబసభ్యులు పాల్గొన్నారు. తాను ఐదేళ్లుగా విచారణ ఖైదీగా జైల్లో ఉన్నానని.. తనకు జరిగిన అన్యాయాన్ని సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ చంద్రచూడ్‌కు లేఖ రాసేందుకు అనుమతివ్వాలని ఎన్‌ఐఏ న్యాయస్థానాన్ని కోరారు. ఇంకా చదవండి
గుడివాడలో హైటెన్షన్- వైసీపీ, టీడీపీ మధ్య ఘర్షణ
ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమం గుడివాడలో హైటెన్షన్ వాతావరణం క్రియేట్ చేస్తోంది. పోటాపోటీ నిరసనలు, ధర్నాలతో హీటెక్కిపోతోంది. మెయిన్ రోడ్డులో టీడీపీ, జనసేన ఓవైపు కార్యక్రమం నిర్వహిస్తుంటే… వైసీపీ మరో వైపు ఎన్టీఆర్ వర్థంతి చేపట్టింది. దీంతో పోటాపోటీ నినాదాలతో గుడివాడ దద్దరిల్లిపోతోంది. ఇంకా చదవండి
కాంగ్రెస్‌లోకి స్వామిగౌడ్
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చేరికలపై దృష్టి పెట్టింది. శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ ను పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ రాజేంద్రనగర్ లో స్వామిగౌడ్ నివాసానికి వెళ్లారు. స్వామిగౌడ్ తో పాటు కుటుంసభ్యులతో చర్చించారు. పార్టీలో చేరిక ఆహ్వానంపై స్వామిగౌడ్ ఎలా స్పందించారన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. పొన్నం ప్రభాకర్ రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తోనూ చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది. ఇంకా చదవండి
వరుసగా ప్రముఖుల సోషల్ మీడియా ఖాతాలు హ్యాక్
మారుతున్న టెక్నాలజీతో సమాచార రంగంలో విప్లవాత్మకంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ట్విటర్ (Twitter), వాట్సాప్ (Whats App), ఫేస్ బుక్ (Face Book), ఇన్ స్టా గ్రామ్ (Instagram) లాంటి సామాజిక మాధ్యమాలు ( Social Media Accounts ) జనంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. స్మార్ట్ ఫోన్లు ప్రతి ఒక్కరు ఒకటికి మించి సోషల్ మీడియా ఖాతాలను నిర్వహిస్తున్నారు. ప్రముఖుల సోషల్ మీడియా ఖాతాలను సైబర్ నేరగాళ్లు వరుసగా హ్యాక్ చేస్తున్నారు. దీంతో బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా చదవండి