Telangana

Todays top ten news at Telangana Andhra Pradesh 28 february 2024 latest news | Top Headlines Today: నన్ను అల్లాటప్పా అనుకోవద్దు – రేవంత్; ఒక్కో ఓటర్‌ని 5 సార్లు కలవండి



మీకు దమ్ముంటే ఒక్క సీటు గెలువు
మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌రెడ్డి అంటే అల్లాటప్పా అనుకోవద్దని.. కేటీఆర్ తరహాలో తండ్రి పేరు చెప్పుకొని పదవిలో కూర్చున్న వ్యక్తిని కాదని అన్నారు. కార్యకర్త స్థాయి నుంచి సీఎం స్థాయికి ఎదిగానని అన్నారు. చంచల్‌గూడ జైలులో పెట్టినా తాను అధైర్యపడకుండా పోరాటం చేశానని గుర్తు చేశారు. లోక్‌సభ ఎన్నికల కోసం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చేవెళ్లలో ‘జనజాతర’ పేరుతో ఓ సభ నిర్వహించింది. ఇంకా చదవండి
ఒక్కో ఓటర్‌ని ఐదు సార్లు కలవండి
ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి క్యాడర్ కు సీఎం జగన్ కీలక సూచనలు చేశారు.  మీ బూత్ కమిటీల పరిధిలో ఉన్న ఓటర్లను ఎన్నికల లోపు కనీసం ఐదారు సార్లు కలవండి. మనం చేసిన, చేసే మంచి పనులు చెప్పండి. బూత్ స్థాయిలో పార్టీని వీలైనంత తొందరగా యాక్టివేట్ చెయ్యాలి. సోషల్ మీడియాలో పార్టీ క్యాడర్ క్రియాశీలకంగా వ్యవహరించాలని దిశానిర్దేశం చేశారు. తమ తమ బూత్ కమిటీల పరిధిలో ఉన్న ఓటర్లను ఎన్నికల లోపు ఐదుసార్లు కలవాలని సూచించారు. ఇంకా చదవండి
తెలంగాణలో 2 కొత్త స్కీమ్స్ అమల్లోకి
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రూ.500 కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్లలోపు ఫ్రీ కరెంటు పథకాలను అధికారికంగా ప్రారంభించారు. తెలంగాణ సచివాలయం ఇందుకు వేదిక అయింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వల్ల ప్రియాంక గాంధీ తెలంగాణ పర్యటన రద్దు అయిందని తెలిపారు. అందుకే చేవెళ్లలో ప్రారంభించాలనుకున్న మరో రెండు గ్యారంటీల కార్యక్రమాన్ని సచివాలయానికి మార్చామని రేవంత్ రెడ్డి అన్నారు. ఇంకా చదవండి
ఏపీకి అమరావతే ఏకైక రాజధాని, నో డౌట్ – రాజ్ నాథ్ సింగ్
ఏపీ రాజధాని అమరావతి అని కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తేల్చి చెప్పారు. విజయవాడలో మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, బాపట్ల లోక్‌సభ నియోజకవర్గాల బీజేపీ కోర్‌ కమిటీ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ లో రాజ్‌నాథ్‌ సింగ్ పాటుగా పార్టీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, కేంద్ర మాజీ మంత్రి సుజనాచౌదరి, బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ తదితరులు పాల్గొన్నారు. ఇంకా చదవండి
‘గ‌గ‌న్ యాన్‌’ ద్వారా అంత‌రిక్షంలోకి వెళ్లే వ్యోమ‌గాములు వీరే
అంత‌రిక్ష రంగం(Space)లో ప్ర‌పంచ దేశాల స‌ర‌స‌న భార‌త్(India) స‌గ‌ర్వంగా త‌లెత్తుకుని నిల‌బ‌డుతున్న విష‌యం తెలిసిందే. అనేక ప్ర‌యోగాల్లో భార‌త్.. అమెరికా(America), చైనా(China) స‌హా ప‌లు దేశాల‌కు దీటుగా దూసుకుపోతోంది. చంద్ర‌యాన్‌(Chandrayan).. వంటి కీల‌క ప్ర‌యోగాల‌తో ప్ర‌పంచ దేశాల దృష్టిని ఆక‌ర్షించింది. అయితే.. మాన‌వులను అంత‌రిక్షంలోకి పంపించ‌డం అనేది మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు భార‌త్‌కు సాధ్యం కాలేదు. ఈ నేప‌థ్యంలో గ‌త మూడేళ్లుగా భార‌త అంత‌రిక్ష ప‌రిశోధ‌న సంస్థ(Indian Space Research Organigation-ISRO) ఆ దిశ‌గా దృష్టి పెట్టింది. ఇంకా చదవండి
మార్చి 15 తరవాత పేటీఎమ్ ఫాస్టాగ్‌లు పని చేయవు
మార్చి 15వ తేదీ తరవాత పేటీఎమ్ ఫాస్టాగ్‌ సర్వీస్‌లు పని చేయవని ఇప్పటికే RBI ప్రకటించింది. FASTag సర్వీస్‌లు అందించే 32 బ్యాంకుల జాబితా నుంచి Paytm Payments Bank Ltd ని తొలగించింది. మార్చి 15వ తేదీ తరవాత ప్రస్తుతం పేటీఎమ్ ద్వారా ఉన్న ఫాస్టాగ్‌లను రీఛార్జ్ చేసుకోడానికి వీలుండదు. ఇప్పుడు పేటీఎమ్‌లో ఈ ట్యాగ్‌ని తీసుకున్న వారు త్వరలోనే దాన్ని వేరే బ్యాంక్‌కి మార్చుకోవాలని అధికారులు స్పష్టం చేశారు. జనవరి 31వ తేదీన RBI పేటీఎమ్ బ్యాంక్‌పై ఆంక్షలు విధించింది. అంతర్గతంగా మనీ లాండరింగ్ జరిగిందని, భారీ అవతవకలు జరిగాయని స్పష్టం చేసింది. వీటిని సరి చేసుకోవాలి ఆదేశించింది. అప్పటి వరకూ ఈ ఆంక్షలు కొనసాగుతాయని వెల్లడించింది. ఇంకా చదవండి
ఈ విషయాలను మీ ఐటీఆర్‌లో కచ్చితంగా చూపాలి
మన దేశంలోని చాలా మంది టాక్స్‌ పేయర్లు వివిధ మార్గాల్లో ఆదాయం సంపాదిస్తున్నారు. కొంతమంది స్వదేశంలోనే ఉంటూ సంపాదిస్తే, మరికొందరు విదేశాలకు వెళ్లి ఉద్యోగాలు చేస్తూ సంపాదిస్తున్నారు. ఇండియాలో కొంత కాలం పని చేసి, ఆ తర్వాత మంచి ఆఫర్‌తో సముద్రాలు దాటి ఎగిరి వెళ్లే వాళ్లు చాలామంది ఉన్నారు. ఇప్పుడు, అలాంటి వ్యక్తులు ఆదాయ పన్ను చెల్లించాలా, అక్కర్లేదా?. ఒకవేళ పన్ను కట్టాల్సి వస్తే ITR ఎలా ఫైల్‌ చేయాలి, ఏయే అంశాలను రిపోర్ట్‌ చేయాలి?. ఇంకా చదవండి
అలా అడగాలంటే కన్ను, కిడ్నీ దానం చేయండి
రానా దగ్గుబాటి తన ఆరోగ్యం గురించి మొదటిసారి స్పందించాడు. ‘బాహుబలి’ సమయంలో చాలామంది తనను కొందరు తన అనారోగ్యం గురించి ప్రశ్నించేవారని, వారికి తాను సమాచారం చెప్పదలుచుకోలేదని అన్నాడు. ఒక వేళ ఎవరైనా తన ఆరోగ్యం గురించి అడగాలంటే.. కిడ్నీ లేదా కన్ను దానం చేసినవారై ఉండాలని తెలిపాడు. గుర్గావ్‌లో జరిగిన Synapse 2024 కార్యక్రమంలో పాల్గొన్న రానా ఈ వ్యాఖ్యలు చేశాడు. ఈ కార్యక్రమంలో దర్శకుడు నాగ్ అశ్విన్ కూడా పాల్గొన్నారు. ఇంకా చదవండి
మహేష్ బాబు కోసం ఆ హాలీవుడ్ దర్శకుడిని రంగంలోకి దింపుతున్న జక్కన్న
రాజమౌళి సినిమా అంటేనే ఎక్కడాలేని క్రేజ్ ఉంటుంది. అలాంటిది మహేష్ బాబుతో మూవీ అంటే ఆ క్రేజ్ మమూలుగా ఉండదు. సినిమా ఇంకా మొదలు కాకముందే.. వీరి కాంబినేషన్‌పై అంచనాలు మొదలైపోయాయి. ఇక సినిమా విడుదలైతే ఆ హైప్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్కక్కర్లేదు. యాక్షన్, ఫారెస్ట్ అడ్వేంచర్‌గా తెరకెక్కబోతున్న ఈ మూవీ అప్‌డేట్స్ కోసం అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇక ఊరించింది చాలు.. అప్‌డేట్ చెప్పవయ్య జక్కన్నా అని మొత్తుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అదిరిపోయే న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. మహేష్-జక్కన్న మూవీ కోసం ఓ హాలీవుడ్ లెజెండ్ డైరెక్టర్ త్వరలోనే ఇండియాకు రాబోతున్నారట. ఆయన ఎందుకు వస్తున్నారనేది త్వరలోనే రివీల్ చేస్తారట. ఇంకా చదవండి
హిట్‌మ్యాన్‌ మరో ఘనత
భారత జట్టు సారధి రోహిత్‌ శర్మ(Rohit Sharma)కు అరుదైన గౌరవం దక్కింది. తమిళనాడు 11వ తరగతి మ్యాథ్స్‌ సిలబస్‌లో హిట్‌మ్యాన్‌ శతకానికి చోటు దక్కింది. టీ 20ల్లో 35 బంతుల్లో శతకాన్ని సాధించిన హిట్‌మ్యాన్‌ ఊచకోతను పాఠ్యాంశంగా పొందుపరిచారు. రోహిత్‌ శతకాన్ని ఉదాహరణగా తీసుకుని గణిత శాస్త్రంలోని ఫంక్షన్స్‌ అండ్‌ రిలేషన్స్‌ కాన్సెప్ట్‌పై పలు ప్రశ్నలు అడిగారు. పాఠ్యాంశంగా మారిన రోహిత్‌ టీ20 సెంచరీ 2017 డిసెంబర్‌లో చేసింది. ఇండోర్‌ వేదికగా శ్రీలంకతో జరిగిన నాటి మ్యాచ్‌లో హిట్‌మ్యాన్‌ 35 బంతుల్లో 10 ఫోర్, 12 సిక్సర్ల సాయంతో సెంచరీ చేశాడు. కొద్ది నెలల కిందటి వరకు ఇది అంతర్జాతీయ టీ20ల్లో జాయింట్‌ ఫాస్టెస్ట్‌ సెంచరీగా చలామణి అయ్యింది. ఇంకా చదవండి

మరిన్ని చూడండి



Source link

Related posts

MLC Kavitha Arrest | Rajasingh | MLC Kavitha Arrest | Rajasingh | ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ పై రాజాసింగ్ రియాక్షన్

Oknews

Telangana CM Revanth Reddy Will Visit Medagadda Barrage on Tuesday with mla and cabinet ministers

Oknews

ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీల దండారీ ఉత్సవాలు

Oknews

Leave a Comment