Latest NewsTelangana

Todays top ten news at Telangana Andhra Pradesh 3 March 2024 latest news | Top Headlines Today: మజ్లిస్ కోటను బీజేపీ బద్దలు కొడుతుందా?; వైసీపీపై చంద్రబాబు కామెంట్స్


మజ్లిస్ కోటను బద్దలు కొట్టేందుకు బీజేపీ కొత్త ప్రయత్నం

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో హైదరాబాద్‌ ఎంపీ స్థానంలో బీజేపీ కొత్త అభ్యర్థిని ప్రకటించింది. అసదుద్దీన్ ఒవైసీ కోటను బద్దలు కొట్టేందుకు కొత్త వ్యూహాలను రచిస్తోందా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. తొలి నాళ్లలో కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అయిన ఈ స్థానం 1984 నుంచి ఎంఐఎం చేతిలోకి వెళ్లిపోయింది.నాడు అక్కడి ఎంఐఎం అభ్యర్థిగా ఉన్న సలావుద్దీన్ ఒవైసీ.. 2004 వరకు వరుసగా ఆరు పర్యాయాలు విజయం సాధించగా, ఆయన మరణం తర్వాత వారసుడైన అసదుద్దీన్ నేటి వరకు ఎంపీగా గెలుస్తూ వచ్చారు. రాష్ట్రంలో ఎక్కడా బీజేపీ ఉనికిలేని రోజుల్లోనూ ఈ స్థానంలో ఎంఐఎంకి గట్టి ప్రత్యర్థిగా బీజేపీ నిలుస్తూ వస్తోంది. ఇంకా చదవండి

ట్యాంక్ బండ్ పై శ్రీపాదరావు సహా పలువురు ప్రముఖుల విగ్రహాలు

హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పై శ్రీపాదరావు విగ్రహం (Statue of Duddilla Sripada Rao) ఏర్పాటు చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ట్యాంక్ బండ్ పై చాకలి ఐలమ్మ, సర్దార్ సర్వాయి పాపన్న సహా తెలంగాణకు చెందిన పాటు పలువురు ప్రముఖుల విగ్రహాలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుందన్నారు. దీనిపై త్వరలోనే మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేస్తామని రేవంత్ తెలిపారు. శ్రీధర్ బాబు అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చారని, మొదటిసారి శ్రీపాద రావు తనయుడుగా ఆయన గెలిచారు. ఇంకా చదవండి

టీడీపీ, జనసేనలో వైసీపీ కోవర్టులు

తాము వచ్చిన వెంటనే పల్నాడు జిల్లాలోని వరికిపుడిసెల ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. అభివృద్దికి మారుపేరు టీడీపీ అని, విధ్వంసానికి మారుపేరు వైసీపీ అని వ్యాఖ్యానించారు. పల్నాడు జిల్లాల్లో అనేకమంది తమ్ముళ్లను పోగొట్టుకున్నానని, కోడెలను వేధించి ఆయన మృతికి వైసీపీ నేతలు కారణమయ్యారని ఆరోపించారు. శనివారం గురజాల నియోజకవర్గంలోని దాచేపల్లిలో జరిగిన రా.. కదలి.. రా బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొన్నారు. ఇంకా చదవండి

టీడీపీలో చేరిన ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు

నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు టీడీపీలో చేరారు. ఆయనతో పాటు మరికొందరు నేతలు టీడీపీలోకి వచ్చారు. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలోని దాచేపల్లిలో నిర్వహించిన రా కదలిరా సభలో టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో లావు శ్రీకృష్ణదేవరాయలు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఇంకా చదవండి

విశ్వక్‌ సేన్‌ మరో సాహసం

మాస్‌ కా దాస్‌ విశ్వక్‌ సేన్‌ క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మాస్‌ అండ్‌ బోల్డ్‌ క్యారెక్టర్స్‌కి కేరాఫ్‌ అడ్రస్‌. మొన్నటి వరకు మాస్‌ రోల్స్‌తో అలరించిన విశ్వక్‌ తాజాగా రూటు మార్చాడు. పాత్రలతో ప్రయోగాలు చేస్తున్నాడు.  ఈసారి ‘గామి’లో సరికొత్తగా అలరించబోతున్నాడు. తన మాస్‌ ఇమేజ్‌ని పక్కన పెట్టి అఘోరగా కొత్త అవతారం ఎత్తాడు. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటున్న ఈ చిత్రం మార్చి 8న థియేటర్లో రిలీజ్‌ కాబోతోంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొన్న విశ్వక్‌ సేన్‌ తన నెక్ట్స్‌ మూవీపై లీక్‌ ఇచ్చాడు. ఇంకా చదవండి

‘హిట్ 3’ను పక్కన పెట్టిన నాని – అదే కారణమా?

హాలీవుడ్‌లోని మల్టీవర్స్ తరహాలో ఇప్పుడు ఇండియన్ సినిమాల్లో కూడా సినిమాటిక్ యూనివర్స్‌లు మొదలయ్యాయి. బాలీవుడ్, కోలీవుడ్‌లో మొదలయిన సినిమాటిక్ యూనివర్స్, మల్టీవర్స్‌ను కాన్సెప్ట్‌ను తెలుగులోకి తీసుకొచ్చిన దర్శకుడు శైలేష్ కొలను. ‘హిట్’ సినిమాతో దర్శకుడిగా తన కెరీర్‌ను ప్రారంభించాడు శైలేష్. అదే తరహాలో ‘హిట్‌వర్స్’ అని ఒక యూనివర్స్‌ను ప్లాన్ చేస్తున్నానని, అందులో ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తాయని ప్రకటించాడు. తను చెప్పినట్టుగానే ఇప్పటికీ ‘హిట్‌వర్స్’లో రెండు సినిమాలు వచ్చాయి. ఇంకా చదవండి

కొడుకు స్పీచ్ విని కన్నీళ్లు పెట్టుకున్న ముకేశ్ అంబానీ – వీడియో వైరల్

అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు జామ్‌నగర్‌లో ఘనంగా జరుగుతున్నాయి. మార్చి 1వ తేదీన ప్రారంభమైన ఈ ఈవెంట్…మార్చి 3వ తేదీన వరకూ కొనసాగనున్నాయి. మొదటి రోజే సినీ ప్రముఖులు హాజరై సందడి చేశారు. పాప్‌సింగర్ రిహాన్నా షో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ముకేశ్ అంబానీ, నీతా అంబానీ ఓ బాలీవుడ్ పాటకి యాక్టింగ్‌ చేసి అందరినీ అలరించారు. ఇంకా చదవండి

అమిత్ షా కార్‌ నంబర్‌ ప్లేట్‌పై CAA,సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్

దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల ముందే CAA అమలు చేస్తామని ఇప్పటికే కీలక ప్రకటన చేశారు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా. అంతా సిద్ధంగా ఉందని, అమలు చేయడమే తరువాయి అని వెల్లడించారు. ఈ క్రమంలోనే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అమిత్‌ షా ప్రయాణిస్తున్న ఓ వైట్‌కార్‌ నంబర్ ప్లేట్‌ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. DL1C AA 4421 అనే నంబర్‌ దానిపై కనిపించింది. ఇంకా చదవండి

వచ్చే ఏడాదంతా భారత్‌ ఆర్థిక వ్యవస్థ ఆశాజనకమే – ఇంటర్నేషనల్ బిజినెస్ రిపోర్ట్

అంతర్జాతీయంగా ఆర్థిక పరంగా ఎన్నో సమస్యలు, సవాళ్లు ఎదురవుతున్నా భారత్ ఆర్థిక వ్యవస్థ మాత్రం సానుకూలంగా ముందుకు దూసుకుపోతోంది. International Business Report (IBR) స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించింది. IBRతో పాటు Grant Thornton సంయుక్తంగా సర్వే నిర్వహించాయి. భారత్‌లో దాదాపు 80% మేర మిడ్ మార్కెట్ బిజినెస్ వచ్చే 12 నెలల పాటు సానుకూలంగానే ఉంటుందని అంచనా వేశాయి. ఇంకా చదవండి

ఆగార్కర్‌ ఆగ్రహంతోనే, అయ్యర్‌పై కొరఢా

దేశవాళీ టోర్నమెంట్లపై నిర్లక్ష్యం చూపిన ఇషాన్‌ కిషన్‌(Ishan Kishan), శ్రేయస్స్‌ అయ్యర్‌(Shreyas iyer)పై బీసీసీఐ(BCCI) కొరఢా ఝుళిపించింది. ఇషాన్‌ కిషన్‌, శ్రేయస్‌ అయ్యర్‌ను కాంట్రాక్టుల నుంచి తొలగించింది. ఈ విషయం హాట్ టాపిక్ అవుతోంది. గ‌తేడాది ప్రక‌టించిన కాంట్రాక్ట్ లిస్ట్‌లో శ్రేయ‌స్ అయ్యర్ B గ్రేడ్‌లో ఉండ‌గా, ఇషాన్‌కిష‌న్ C గ్రేడ్‌లో ఉన్నారు. ఇంకా చదవండి

మరిన్ని చూడండి



Source link

Related posts

Hyderabad Nampalli Court dismissed six out of eight cases today in tollywood drugs case

Oknews

Telangana Elections 2023 |KCR vs Sajjala Rama Krishna Reddy |కేసీఆర్ కు సజ్జల కౌంటర్ | ABP Desam

Oknews

Weather in Telangana Andhrapradesh Hyderabad on 19 March 2024 Summer updates latest news here | Weather Latest Update: నేడు ఇక్కడ భారీ వర్ష సూచన! వడగండ్లతో ఆరెంజ్ అలర్ట్

Oknews

Leave a Comment