Latest NewsTelangana

top telugu news from andhrapradesh and telangana on february 4th 2024 | Top Headlines Today: సీట్ల సర్దుబాటుపై చంద్రబాబు, పవన్ కీలక భేటీ


సీట్ల సర్దుబాటుపై చంద్రబాబు, పవన్ కీలక భేటీ

ఏపీలో రాబోయే ఎన్నికల కోసం కూటమిగా ఏర్పడ్డ టీడీపీ – జనసేన పార్టీలు సీట్ల పంపకం విషయంలో ఇంకా కసరత్తు కొనసాగిస్తున్నాయి. ఈ విషయంపై తాజాగా ఇరు పార్టీల అధినేతలు భేటీ అయ్యారు. విజయవాడలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సమావేశం అయ్యారు. చంద్రబాబు నాయుడు ప్రత్యేక హెలికాప్టర్ లో ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకున్న కాసేపటికే పవన్ కళ్యాణ్ కూడా అక్కడికి వచ్చారు. సీట్ల సర్దుబాటు పైనే వీరి మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే పోటీ చేసే స్థానాలపై ఇరు అధినేతలు ఒక అవగాహనకు వచ్చినట్లు తెలిసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

వైసీపీకి ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ రాజీనామా?

మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ వైసీపీకి రాజీనామా చేయబోతుండడం దాదాపు ఖాయంగా తెలుస్తోంది. త్వరలో ఆయన టీడీపీలో చేరబోతున్నట్లుగా వసంత కృష్ణప్రసాద్‌ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. గత పది రోజులుగా నియోజకవర్గంలో వసంత కృష్ణప్రసాద్‌ అందుబాటులో లేరు. మరోవైపు, నందిగామ మండలం ఐతవరంలోని తన ఇంట్లో కార్యకర్తలతో కృష్ణ ప్రసాద్‌ మీటింగ్‌ ఏర్పాటు చేశారు. తన అనుచరులతో, పార్టీ కార్యకర్తలతో చర్చించి.. వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. వసంత కృష్ణప్రసాద్‌ ఈ నెల 8న టీడీపీలో చేరతారనే ప్రచారం జోరుగా ఉంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

పద్మ అవార్డు గ్రహీతలకు తెలంగాణ ప్రభుత్వ సత్కారం

ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డులకు ఎంపికైన వారిని తెలంగాణ ప్రభుత్వం సత్కరించింది. ఇందుకోసం హైదరాబాద్ హైటెక్ సిటీలోని శిల్పకళావేదికలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. పద్మ అవార్డుల్లో భాగంగా పద్మవిభూషణ్‌ పురస్కారానికి ఎంపికైన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, చిరంజీవిని సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు సన్మానించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

నియామక పరీక్షల ఫలితాల వెల్లడికి సర్కార్ కసరత్తు

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన నియామక పరీక్షల (Recruitment Exams) ఫలితాల వెల్లడికి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే పరీక్షలు నిర్వహించిన నియామక సంస్థలు ఫలితాలు వెల్లడించేందుకు సిద్ధంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో మహిళలకు సమాంతర రిజర్వేషన్లపై ప్రభుత్వం పరిపాలనాపరమైన విధాన నిర్ణయం తీసుకోనుంది. ఈ ఉత్తర్వులు వెలువడగానే వారం నుంచి పది రోజుల్లోనే ఫలితాలు విడుదల చేయాలని ప్రభుత్వం స్పష్టంచేసింది. వీటి అమలుకు ఇప్పటికే సాధారణ పరిపాలనశాఖ, టీఎస్‌పీఎస్సీ, మహిళా సంక్షేమశాఖలు సంయుక్తంగా ముసాయిదా విధానాన్ని సిద్ధం చేశాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

రెవెన్యూ శాఖ ప్రక్షాళనపై కాంగ్రెస్ ప్రభుత్వ ప్రణాళికలు

తెలంగాణలో రెవెన్యూ వ్యవస్థను పూర్తిస్థాయిలో ప్రక్షాళనకు కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం నడుం బిగించింది. ధరణిలో అవకతవకలు, రెవెన్యూ శాఖలో అక్రమాలు, రిజిస్ట్రేషన్‌శాఖలో లొసుగులతో రైతులు, సామాన్య ప్రజలు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారని గుర్తించిన రేవంత్ (Revanth Reddy) ప్రభుత్వం…పూర్తిస్థాయిలో రెవెన్యూశాఖను ప్రక్షాళన చేయాలని నిర్ణయించింది. అవినీతికి తావులేకుండా పారదర్శకంగా సేవలు అందించేలా వ్యవస్థను పటిష్టం చేయడానికి దేశంలోనే అత్యుత్తమ విధానాలు పరిశీలించనున్నట్లు రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

 

మరిన్ని చూడండి



Source link

Related posts

Gold Silver Prices Today 01 February 2024 know rates in your city Telangana Hyderabad Andhra Pradesh Amaravati | Gold-Silver Prices Today: అమాంతం పెరిగిన పసిడి

Oknews

ఉప్పల్ లో ఐపీఎల్ మ్యాచ్, అర్ధరాత్రి వరకూ మెట్రో సేవలు పొడిగింపు-hyderabad uppal srh vs mi ipl match metro train service extended up to midnight ,తెలంగాణ న్యూస్

Oknews

Game Changer shooting update గేమ్ ఛేంజర్ ఫినిష్ అయ్యేది అప్పుడే!

Oknews

Leave a Comment