Telugu News Today: తెలంగాణ అసెంబ్లీలో జల జగడం – ప్రభుత్వం Vs బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మధ్య వాడీ వేడీ వాదనలు – తెలంగాణ అసెంబ్లీలో జల జగడం తీవ్రమైంది. కృష్ణా నదీ జలాలు, కేఆర్ఎంబీ సంబంధిత అంశాలపై శాసనసభలో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య వాడీ వేడీ వాదనలు సాగాయి. దక్షిణాది తెలంగాణ కృష్ణా జలాలపై ఆధారపడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కృష్ణా జలాలకు సంబంధించి అసెంబ్లీలో చర్చ జరుగుతుంటే.. ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ చర్చలో పాల్గొనకుండా ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారని విమర్శించారు. శాసనసభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు పచ్చి అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
‘నమ్మి ఓట్లు వేసిన బీసీలకు మోసం – పవర్‌లెస్ పదవులతో అవమానం’ జగన్‌పై వైసీపీ ఎమ్మెల్సీ తిరుగుబాటు
వైసీపీలో సీఎం జగన్ (CM Jagan) ది ఒంటెద్దు పోకడ అంటూ ఆ పార్టీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి (Janga Krishna Murthy) మండిపడ్డారు. సామాజిక న్యాయం కోసం జగన్ రెడ్డికి నమ్మి ఓట్లు వేసి మోసపోయామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు. ‘వైసీపీలో పవర్ కొద్ది మంది చేతుల్లో మాత్రమే ఉంది. ఆ పార్టీలో బీసీలు అవమానాలకు గురవుతున్నారు. బీసీలది ఆత్మగౌరవ పోరాటం. పార్టీలో జగన్మోహన్ రెడ్డి ఒంటెద్దు పోకడ చాలా బాగా కనిపిస్తోందన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
‘కృష్ణా ప్రాజెక్టులు కేంద్రానికి అప్పగించడం లేదు’ – మంత్రి ఉత్తమ్ ప్రకటన
కృష్ణా నదీ ప్రాజెక్టులు, కేఆర్ఎంబీ సంబంధిత అంశాలపై తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టింది. కృష్ణా నదీ జలాల ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడం లేదని జల వనరుల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. షరతులు అంగీకరించకుండా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించేది లేదని స్పష్టం చేశారు. రాష్ట్రానికి దక్కాల్సిన వాటా కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని స్పష్టం చేశారు. ఈ మేరకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
ఆళ్లగడ్డలో మరోసారి తలపడనున్న భూమా అఖిలప్రియా, బ్రిజేంద్రకుమార్ రెడ్డి
తరతరాలుగా ఉన్న కక్షలు, కార్పణ్యాలు.. ఆధిపత్య పోరులో ప్రాణాలు కోల్పోయినవారు ఎందరో..ఒకప్పుడు బాంబుల గడ్డగా పేరుగాంచిన ఆ పోరుగడ్డలో ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్నాయి. ఫ్యాక్షన్ గొడవలు తగ్గి ఆళ్లగడ్డలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. అయితే ఎన్నికల సమయం వచ్చిందంటే చాలు…మళ్లీ ఒకరమైన ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తుతున్నాయి. అధికార పార్టీ వైసీపీ నుంచి ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రరెడ్డి(Gangula Brijendra Reddy), తెలుగుదేశం నుంచి మరోసారి భూమా అఖిలప్రియా(Akhila Priya) పోటీలో నిలిచే అవకాశం ఉంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
హుక్కా పార్లర్లపై నిషేధం – సంబంధిత బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం
రాష్ట్రంలో హుక్కా పార్లర్లపై నిషేధం విధించారు. ఈ మేరకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో సోమవారం హుక్కా పార్లర్ల నిషేధ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టింది. మంత్రి శ్రీధర్ బాబు సీఎం రేవంత్ రెడ్డి తరఫున బిల్లును సభ ముందుకు తీసుకొచ్చారు. దీనిపై ఎలాంటి చర్చ లేకుండా ఏకగ్రీవంగా శాసనసభ బిల్లుకు ఆమోదం తెలిపింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
మరిన్ని చూడండి