Latest NewsTelangana

Top Telugu News Today From Andhra Pradesh Telangana 17 March 2024 | Top Headlines Today: సీఈవో ముఖేష్ కుమార్ మీనా కీలక ఆదేశాలు


Telugu News Today: ప్రధాని మోదీ కాలుపెడితే కవిత అరెస్ట్ – నాగర్ కర్నూల్ లో సభ పెడితే ఆర్ఎస్పీ రిజైన్, తెలంగాణలో ఏం జరుగుతోంది?
తెలంగాణలో ఏం జరుగుతోంది… అందులో బీఆర్ఎస్ – బీజేపీ మధ్య ఏం జరుగుతోంది.? శుక్రవారం ప్రధాని మోదీ హైదరాబాద్ లో కాలు పెట్టగానే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. శనివారం నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలో మోదీ సభ నిర్వహిస్తే, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీ పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచే కాక ఏకంగా పార్టీ సభ్యత్వానికి రిజైన్ చేశారు. ఈ రెండు పరిణామాలకు కారణం బీజేపీయేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

మంగళగిరిలో అన్న క్యాంటిన్ ధ్వంసం – అర్ధరాత్రి హంగామా!
మంగళగిరిలో టౌన్ ఫ్లానింగ్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. స్థానికంగా ఉన్న అన్న క్యాంటీన్‌ను అధికారులు ధ్వంసం చేశారు. ఓ టెంట్ లో నిర్వహిస్తున్న అన్న క్యాంటిన్ ను ఎటువంటి నోటీసులు లేకుండా తొలగింపునకు పాల్పడ్డారు. దీన్ని అన్నా క్యాంటిన్ నిర్వహకులు, స్థానిక ప్రజలు అడ్డుకున్నారు. రేపటి నుంచి అన్న క్యాంటిన్ పెట్టడానికి వీలు లేదు అంటూ హుకుం జారీ చేశారు. ఎలక్షన్ కోడ్ నేపథ్యంలో ఉన్న ఫ్లెక్సీలను తొలగించాలి కానీ పేదలకి అన్నం పెట్టే క్యాంటీన్‌ టెంట్, సామాగ్రిని ధ్వంసం చేయడం ఏమిటని ప్రజలు ప్రశ్నించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

ఆ గంజాయి మొక్కల్ని పీకే పనిలో ఉన్నా, తన్నీరు పన్నీరు కాలేడు – రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఈ 100 రోజులు ప్రజల కోసమే పని చేశానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్నికల సంఘం నగారా మోగించినందున ఇకపై ఎన్నికలు పూర్తయ్యే వరకు తాను పూర్తి రాజకీయ పార్టీ నాయకుడిగా పని చేస్తానని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అద్భుత ఫలితాలు సాధించడానికి పని చేస్తానని అన్నారు. హైదరాబాద్ బషీర్ బాగ్‌లోని ఓ ఆడిటోరియంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీట్ ది మీడియా కార్యక్రమం నిర్వహించారు.  పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

ఏపీ ఎన్నికలు – సీఈవో ముఖేష్ కుమార్ మీనా కీలక ఆదేశాలు, హోర్డింగులు తొలగించేందుకు డెడ్ లైన్
ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా (Mukesh Kumar Meena) కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో రాజకీయ ప్రకటనల హోర్డింగులు, పోస్టర్లు, కటౌట్లను వెంటనే తొలగించాలని ఆదేశించారు. రాష్ట్ర సచివాలయ పరిసరాలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ స్థలాల్లో నిబంధనలు కచ్చితంగా పాటించాలని.. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల్లోపు రాజకీయ ప్రకటనల కటౌట్లు తొలగించాలని స్పష్టం చేశారు.  పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

బీజేపీలో చేరిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే – రెండ్రోజుల్లోనే ట్విస్ట్!
వర్థన్నపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత ఆరూరి రమేష్ బీజేపీలో చేరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆరూరి రమేష్ తో పాటుగా ఉమ్మడి వరంగల్ నుంచి కొంత మంది నేతలు బీజేపీలో చేరారు. హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఈ చేరికల కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడారు. ప్రధాని మోదీ, బీజేపీ పట్ల సానుకూల వాతావరణం ఉందని అన్నారు. గతంలో ఇలాంటి సానుకూల పరిస్థితి ఏ పార్టీకి లేదని అన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

మరిన్ని చూడండి



Source link

Related posts

Speculation on Raja Saab storyline రాజాసాబ్ స్టోరీ పై దర్శకుడు ట్విస్ట్

Oknews

Brinda web series review: బృంద వెబ్ సిరీస్ రివ్యూ

Oknews

Here is Ramayan triology cast రామాయణ్‌: రణబీర్-సాయి పల్లవి-యష్ ఫిక్స్

Oknews

Leave a Comment