Latest NewsTelangana

TREIRB has released Gurukula TGT Hindi and English Final Selection Results check here | Gurukula TGT Results: ‘గురుకుల’ టీజీటీ హిందీ, ఇంగ్లిష్ తుది ఫలితాలు విడుదల


TGT Final Results: తెలంగాణలోని సంక్షేమ గురుకుల పాఠశాలల్లో టీజీటీ హిందీ, ఇంగ్లిష్ పోస్టుల భర్తీకి సంబంధించిన తుది ఫలితాలను గురుకుల నియామక బోర్డు విడుదలచేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల వివరాలను సబ్జెక్టులవారీగా అందుబాటులో ఉంచింది. హిందీ పోస్టులకు 422 మంది అభ్యర్థులు, ఇంగ్లిష్ పోస్టులకు 618 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. గురుకుల టీజీటీ పోస్టుల భర్తీకి గతేడాది ఆగస్టు 3 నంచి 23 వరకు రాత పరీక్షలు నిర్వహించిన బోర్డు.. ఈ పరీక్షల్లో మెరిట్ సాధించిన అభ్యర్థులను 1:2 నిష్పత్తిలో సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు ఎంపిక చేసింది. ఎంపికైనవారికి ఫిబ్రవరి 27, 28 తేదీల్లో ధ్రువ పత్రాల పరిశీలన నిర్వహించిన తర్వాత.. తుది ఎంపిక ఫలితాలను విడుదల చేసింది. మొత్తం 10 సబ్జెక్టులకుగాను ఇప్పటికే 8 సబ్జెక్టులకు ఎంపికైన అభ్యర్థుల వివరాలు ప్రకటించగా.. తాజాగా హిందీ, ఇంగ్లిష్ సబ్జెక్టుల తుది ఫలితాలను గురుకులబోర్డు విడుదల చేసింది.

సబ్జెక్టులవారీగా ఎంపికైన అభ్యర్థుల వివరాలు ఇలా..
తెలంగాణలోని సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 4,020 టీజీటీ పోస్టులకుగాను మొత్తం 3489 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. వీటిలో బయోలజికల్ సైన్స్-301, జనరల్ సైన్స్-85, హిందీ, మ్యాథమెటిక్స్-675, ఫిజికల్ సైన్స్-374, సంస్కృతం-14, సోషల్ స్టడీస్-525, తెలుగు-426, ఉర్దూ-49, హిందీ, ఇంగ్లిష్-618, హిందీ- 422 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు.

 TGT – Hindi Provisional Selection List

 TGT – English Provisional Selection List

 TGT – Social Studies Provisional Selection List

 TGT – Physical Science Provisional Selection List

 TGT – Biological Science Provisional Selection List

 TGT – Telugu Provisional Selection List

 TGT – Mathematics Provisional Selection List

 TGT – Urdu Provisional Selection List

 TGT – Science Provisional Selection List

 TGT – Sanskrit Provisional selection list

పోస్టుల వివరాలు..

* ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) పోస్టులు

మొత్తం ఖాళీల సంఖ్య: 4006

➥ సాంఘిక సంక్షేమ గురుకులాలు

పోస్టుల సంఖ్య: 728

సబ్జెక్టులవారీగా ఖాళీలు: తెలుగు – 98, హిందీ – 65, ఇంగ్లిష్ – 85, మ్యాథమెటిక్స్ – 101, ఫిజికల్ సైన్స్ – 147, బయోలాజికల్ సైన్స్ – 45, సోషల్ స్టడీస్ – 187.

➥ గిరిజన సంక్షేమ గురుకులాలు 

పోస్టుల సంఖ్య: 218 

సబ్జెక్టులవారీగా ఖాళీలు: తెలుగు – 28, హిందీ – 39, ఇంగ్లిష్ – 19, మ్యాథమెటిక్స్ – 29, ఫిజికల్ సైన్స్ – 15, బయోలాజికల్ సైన్స్ – 21, జనరల్ స్టడీస్ – 20, సోషల్ స్టడీస్ – 47.

➥ బీసీ సంక్షేమ గురుకులాలు 

పోస్టుల సంఖ్య: 2379 

సబ్జెక్టులవారీగా ఖాళీలు: తెలుగు – 285, హిందీ – 263, ఇంగ్లిష్ – 506, మ్యాథమెటిక్స్ – 520, ఫిజికల్ సైన్స్ – 269, బయోలాజికల్ సైన్స్ – 261, సోషల్ స్టడీస్ – 275.

➥ మైనార్టీ గురుకులాలు 

పోస్టుల సంఖ్య: 594

సబ్జెక్టులవారీగా ఖాళీలు: తెలుగు – 55, ఉర్దూ-120, హిందీ – 147, ఇంగ్లిష్ – 55, మ్యాథమెటిక్స్ – 86, సోషల్ స్టడీస్ – 103, జనరల్ స్టడీస్ – 76, సోషల్ స్టడీస్ – 55.

➥ గురుకుల పాఠశాలలు 

పోస్టుల సంఖ్య: 87 

సబ్జెక్టులవారీగా ఖాళీలు: తెలుగు – 22, సంస్కృతం-25, హిందీ – 02, ఇంగ్లిష్ – 16, మ్యాథమెటిక్స్ – 05, జనరల్ స్టడీస్ – 02, సోషల్ స్టడీస్ – 15.

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి…

ALSO READ:

లైబ్రేరియన్‌ పోస్టుల ఫలితాలు విడుదల, సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు ఎంపికైంది వీరే
తెలంగాణలోని ఇంటర్, సాంకేతిక విద్యలో లైబ్రేరియన్ పోస్టుల భర్తీకి సంబంధించిన రాతపరీక్ష ఫలితాలను టీఎస్‌పీఎస్సీ విడుదల చేసింది. రాతపరీక్ష ద్వారా 1:2 నిష్పత్తిలో ఎంపికైన అభ్యర్థుల జాబితాను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఎంపికైన అభ్యర్థులకు మార్చి 5న ధ్రువ పత్రాల పరిశీలన నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ శుక్రవారం (మార్చి 1న) తెలిపింది. మార్చి 5న ఉదయం 10.30 గంటల నుంచి టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలో పరిశీలన ఉంటుందని పేర్కొంది. సర్టిఫికేట్ల పరిశీలనకు వచ్చే అభ్యర్థులందరూ చెక్‌లిస్టులోని పత్రాలు తీసుకురావాలని సూచించింది. 
ఫలితాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..



Source link

Related posts

Somasila Tour Package : 2 రోజుల ‘సోమశిల’ ట్రిప్

Oknews

ED raid Capricornian shipping finds Rs 2.5 Crore inside washing machine Money Laundering

Oknews

Mokshagna debut with Mass Director మోక్షజ్ఞ ఎంట్రీ ఆ మాస్ డైరెక్టర్ తోనా?

Oknews

Leave a Comment