TS Election Code Rules: హైదరాబాద్: ఎన్నికల సంఘం మినహాయింపులతో ఇంటి నుంచి ఓటు వేయనున్న వారు ఏప్రిల్ 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటి వద్ద ఓటింగ్ ప్రక్రియ అభ్యర్థుల నామినేషన్ ఉపసంహరణ తరువాత మూడు, నాలుగు రోజులకు మొదలుపెడతామని తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ తెలిపారు. రాష్ట్ర సీఈవో వికాస్ రాజ్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి పలు విషయాలు వెల్లడించారు. అత్యవసర సర్వీసులు అనే విభాగాలకు చెందిన ఉద్యోగులు ఈసీ నిర్ణయించినట్లుగా పోస్టల్ ఓటింగ్ అవకాశం కల్పించారు.

ఎన్నికల కోడ్ ఉంది జాగ్రత్త
ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున రూ.50 వేలకు మించి నగదును వెంట తీసుకెళ్లకూడదని తెలంగాణ సీఈవో వికాస్ రాజ్ రాష్ట్ర ప్రజలకు సూచించారు. ఒకవేళ అంతకుమించి నగదు వాళ్లు తీసుకెళ్తున్నట్లయితే అందుకు సంబంధించిన డాక్యమెంట్స్, ఇతర పత్రాలు వెంట తీసుకెళ్లాలని చెప్పారు. ఫిర్యాదుల కోసం సీ విజిల్ యాప్ ఉంది. నేషనల్ గ్రీవెన్స్ సర్వీస్ పోర్టల్ లో వెబ్ ద్వారా, కాల్ సెంటర్ 1950కి కాల్ చేసి ఫిర్యా చేయవచ్చునని తెలిపారు. జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాలో కంయిట్రోల్ సెంటర్లు ఏర్పాటు చేశారు.

అసెంబ్లీ ఎన్నికల్లో పోస్టల్, హోమ్ ఓటింగ్
పోస్టల్ బ్యాలెట్ ప్రింటింగ్ రిటర్నింగ్ ఆఫీసర్ (ఆర్వో) వద్ద ఉంటుంది. ఈవీఎం బ్యాలెట్ పేపర్ల ప్రింటింగ్ గతంలో తరహాలోనే చంచల్ గూడలో చేస్తారు. గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో 2.09 లక్షల మంది పోస్టల్, హోమ్ ఓటింగ్ జరిగిందని వికాస్ రాజ్ తెలిపారు. రిటర్నింగ్ ఆఫీసర్, డీవో, పోలీస్ అధికారులకు ట్రైనింగ్ ఇచ్చారు. ఈఆర్వో, ఏఈఆర్వో, ఈవీఎం మోడల్ ఆఫీసర్లకు సాఫ్ట్ వేర్ వాళ్లతో ట్రైనింగ్ ఇప్పించామని తెలిపారు. ఎన్నికలకు అవసరమైన ఈవీఎంలు తమ వద్ద సిద్ధంగా ఉన్నాయని.. 57000 బీయూలు, 44,500 కంట్రోల్ యూనిట్, 48 వేల వీవీ ప్యాట్ మేషీన్ల అవసరం కాగా, తమ వద్ద అన్ని ఉన్నట్లు వికాస్ రాజ్ స్పష్టం చేశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ కు ఉప ఎన్నిక ఉందని, దానికి కావాల్సిన బీయూలు, వీవీప్యాట్, సీయూలు 500 చొప్పున సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

Source link