Latest NewsTelangana

TS ECET 2024 Schedule released check important dates here | తెలంగాణ ఈసెట్


TS ECET 2024 Schedule: బీటెక్‌ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ ప్రవేశాల కోసం నిర్వహించే ‘టీఎస్‌ ఈసెట్‌’ షెడ్యూలును ఉన్నత విద్యామండలి ఫిబ్రవరి 9న విడుదల చేసింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. ఫిబ్రవరి 14న ఈసెట్ నోటిఫికేషన్‌ విడుదల కానుంది. ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 16 వరకు దరఖాస్తుల స్వీకరించనున్నారు. ఆలస్యరుసుముతో ఏప్రిల్ 28 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఏప్రిల్ 24 నుంచి 28 వరకు దరఖాస్తుల్లో తప్పులుంటే సరిచేసుకునేందుకు అవకాశం ఇచ్చారు.  మే 6న టీఎస్ ఈ సెట్ పరీక్ష నిర్వహించనున్నారు.

టీఎస్ ఈసెట్ షెడ్యూలు..

➥ ఈసెట్ నోటిఫికేషన్‌ విడుదల: ఫిబ్రవరి 14  

➥ ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తుల‌ స్వీక‌రణ: ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 16 వరకు 

➥ ఆల‌స్యం రుసుంతో ద‌ర‌ఖాస్తుకు అవకాశం: ఏప్రిల్ 28 వరకు 

➥ దరఖాస్తుల సవరణకు అవకాశం: ఏప్రిల్ 24 నుంచి 28 వరకు 

➥ ఈసెట్ ప్రవేశ ప‌రీక్ష నిర్వహణ: మే 6న. 

లాసెట్ షెడ్యూల్ విడుద‌ల‌..
తెలంగాణలోని న్యాయకళాశాలల్లో మూడేళ్లు, ఐదేళ్ల లా డిగ్రీ(ఎల్‌ఎల్‌బీ)తో పాటు పీజీ లా (ఎల్‌ఎల్‌ఎం) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్‌లాసెట్, పీజీఎల్‌సెట్ షెడ్యూలును ఉన్నత విద్యామండలి ఫిబ్రవరి 9న విడుదల చేసింది. ప్రాథమిక సమాచారం మేరకు ఫిబ్రవరి 28న లాసెట్/పీజీఎల్‌సెట్ నోటిఫికేషన్‌ విడుదల కానుంది. మార్చి 1 నుంచి ఏప్రిల్ 15 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆల‌స్య రుసుంతో మే 25 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తుల‌ు సమర్పించవచ్చు. తెలంగాణలోని న్యాయకళాశాలల్లో మూడేళ్లు, ఐదేళ్ల లా డిగ్రీ(ఎల్‌ఎల్‌బీ)తో పాటు పీజీ లా (ఎల్‌ఎల్‌ఎం) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్‌లాసెట్, పీజీఎల్‌సెట్ షెడ్యూలును ఉన్నత విద్యామండలి ఫిబ్రవరి 9న విడుదల చేసింది. ప్రాథమిక సమాచారం మేరకు ఫిబ్రవరి 28న లాసెట్/పీజీఎల్‌సెట్ నోటిఫికేషన్‌ విడుదల కానుంది. మార్చి 1 నుంచి ఏప్రిల్ 15 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆల‌స్య రుసుంతో మే 25 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తుల‌ు సమర్పించవచ్చు.

లాసెట్, పీజీఎల్‌సెట్ షెడ్యూలు ఇలా..

➥ టీఎస్ లాసెట్/ టీఎస్‌పీజీ ఎల్‌సెట్ నోటిఫికేషన్: 28.02.2024.

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 01.03.2024.

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 15.04.2023.

➥ ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరితేది: 25-05-2024.

➥ లాసెట్, పీజీఎల్‌సెట్ పరీక్ష తేది: 03.06.2024.

ఇతర ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూలు ఇలా..

➥ టీఎస్ ఈఏపీసెట్ నోటిఫికేషన్  ఫిబ్రవరి 21న వెలువడనుంది. ఫిబ్రవరి 26 నుంచి ఏప్రిల్ 6 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. మే 9 నుంచి 12 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. మే 9 నుంచి 11 వరకు ఎంసెట్ ఇంజినీరింగ్ కోర్సుల‌కు ఎంట్రెన్స్ ఎగ్జామ్ నిర్వహించనున్నారు. అలాగే మే 12న అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ ప్రవేశ పరీక్ష జరగనుంది. 

➥ బీఈడీ కోర్సులో ప్రవేశాలకు ఉద్దేశించిన టీఎస్ ఎడ్‌సెట్ ప్రవేశ పరీక్ష మే 23న జ‌ర‌గ‌నుంది. నల్గొండలోని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఈ పరీక్షను నిర్వహించ‌నుంది. 

➥ ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్దేశించిన ‘టీఎస్ ఐసెట్’ ప్రవేశ పరీక్షను జూన్ 4, 5 తేదీల్లో నిర్వహించ‌నున్నారు. కాకతీయ యూనివర్సిటీ నిర్వహణలో ఈ కామన్ ఎంట్రెన్స్ టెస్టు జర‌గ‌నుంది. 

➥ బీపీఎడ్, డీపీఎడ్ కోర్సుల్లో ప్రవేశాల‌కు నిర్వహించే ‘టీఎస్ పీఈసెట్’ ప‌రీక్షను జూన్ 10 నుంచి 13 మ‌ధ్య నిర్వహించ‌నున్నారు. శాతవాహ‌న యూనివ‌ర్సిటీ పరీక్ష నిర్వహణ బాధ్యతలు చేపట్టింది. 

➥ ఎంటెక్, ఎంఫార్మసీ కోర్సుల్లో ప్రవేశం కోసం ఉద్దేశించిన టీఎస్ పీజీఈసెట్ పరీక్ష జూన్ 6 నుంచి 8 వరకు నిర్వహించ‌నున్నారు. హైదరాబాద్ జేఎన్టీయూ పరీక్ష నిర్వహించనుంది.

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి



Source link

Related posts

రాజ్యసభ ఎన్నికలు… బీఆర్ఎస్ నుంచి ఆ ఒక్కరు ఎవరు..?-who will get a chance to go to rajya sabha from brs party ,తెలంగాణ న్యూస్

Oknews

కోదండరాం గొప్పతనం గురించి చెప్పాలా.?

Oknews

TDP టీడీపీని వీడిన గొల్లపల్లి..

Oknews

Leave a Comment