మొత్తం 339 అసిస్టెంట్ ఇంజినీర్, 60 కెమిస్ట్ పోస్టుల భర్తీకి గత ఏడాది అక్టోబరు 5న నోటిఫికేషన్ విడుదలైంది. అభ్యర్థుల నుంచి అక్టోబరు 7 నుంచి నవంబరు 10 వరకు అప్లికేషన్లు స్వీకరించారు. నవంబరు 14, 15 తేదీల్లో దరఖాస్తుల సవరణకు అభ్యర్థులకు అవకాశం కల్పించారు. డిసెంబర్ 17న రాత పరీక్ష నిర్వహిస్తామని జెన్ కో ప్రకటించింది. అయితే అసెంబ్లీ ఎన్నికలతో పాటు పలు కారణాలతో ఈ పరీక్ష వాయిదా పడింది. అయితే తిరిగి మార్చి 31వ తేదీన పరీక్షలను నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు జెన్ కో(Telangana Genco Ecams 2024) ప్రకటన కూడా విడుదల చేసింది. మెకానికల్, కెమిస్ట్ అభ్యర్థులకు షిఫ్ట్-1 ఉదయం 9.00 నుంచి 10.40 వరకు, ఎలక్ట్రికల్ అభ్యర్థులకు షిఫ్ట్-2 మధ్యాహ్నం 1.00 నుంచి 2.40 వరకు, సివిల్, ఎలక్ట్రానిక్స్ అభ్యర్థులకు షిఫ్ట్-3 సాయంత్రం 5.00 నుంచి 6.40 వరకు రాత పరీక్ష నిర్వహిస్తామని కూడా తెలిపింది.
Source link