Telangana

TS Model School Hall Tickets : తెలంగాణ మోడల్ స్కూల్ ప్రవేశాల హాల్ టికెట్లు విడుదల



TS Model School Hall Tickets Download : ఇలా డౌన్లోడ్ చేసుకోవచ్చు….6వ తరగతి అడ్మిషన్ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు…  https://telanganams.cgg.gov.in/TSMSWEB20/#/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.ఆరో తరగతి ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు… హోంపేజీలో కనిపించే Download Hall Ticket అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.ఇందులో Candidate Id / Reference Id మరియు పుట్టిన తేదీ వివరాలను ఎంట్రీ చేయాలి. ఇలా కాకుండా… మొబైల్ నెంబర్ ను ఎంట్రీ చేయవచ్చు. ఆ తర్వాత Go అనే బటన్ పై నొక్కితే…. హాల్ టికెట్ డిస్ ప్లే అవుతుంది. ప్రింట్ లేదా డౌన్లోడ్ అనే ఆప్షన్ పై నొక్కి హాల్ టికెట్ కాపీని పొందవచ్చు.7 -10 తరగతుల్లో అడ్మిషన్ల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు కూడా పైన పేర్కొన్న వెబ్ సైట్ లోకే వెళ్లాలి.హోంపేజీలో కనిపించే…. Notification – TSMS VII TO X CLASS – 2024 ఆప్షన్ కనిపిస్తుంది. దాని పక్కనే ఉండే హాల్ టికెట్ ఆప్షన్ పై క్లిక్ చేసి మీ హాల్ టికెట్ ను పొందవచ్చు. ముఖ్య వివరాలు:పరీక్ష తేదీ – ఏప్రిల్ 7, 2024.టైమింగ్స్ -ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు 6వ తరగతి వారికి, ➥ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు 7 నుంచి 10వ తరగతికి పరీక్షలు నిర్వహిస్తారు.ఎగ్జామ్ సెంటర్ – అభ్యర్థులు వారివారి మండల కేంద్రాల్లో పరీక్షలు రాయాల్సి ఉంటుంది.పరీక్ష విధానం – మొత్తం 100 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు కేటాయిస్తారు. మొత్తం నాలుగు విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో విభాగానికి 25 మార్కులు కేటాయించారు. 6వ తరగతికి (తెలుగు, మ్యాథమెటిక్స్, సైన్స్&సోషల్(ఈవీఎస్), ఇంగ్లిష్) నుంచి మిగతా తరగతులవారికి (ఇంగ్లిష్,మ్యాథమెటిక్స్, జనరల్ సైన్స్, సోషల్ స్టడీస్) నుంచి ప్రశ్నలు అడుగుతారు.పరీక్ష సమయం – 2 గంటలు.ఎంపిక విధానం – ప్రవేశ పరీక్ష ఆధారంగాఅధికారిక వెబ్ సైట్ – https://telanganams.cgg.gov.in/TSMSWEB20/#/ APMS Inter Admissions 2024: మరోవైపు ఏపీ మోడల్ స్కూళ్లలోని ఇంటర్ ప్రవేశాలకు(APMS Inter Admissions 2024) సంబంధించి ప్రకటన విడుదలైంది. ఇందులో భాగంగా…. 2024-25 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు కల్పిస్తారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం వారికి మాత్రం ఈ ప్రవేశాలు ఉంటాయి. ఇందుకు సంబంధించి ఆన్ లైన్ లోనే దరఖాస్తులు చేసుకోవాలి. మార్చి 28 నుంచి అప్లికేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. మే 22వ తేదీని తుది గడువుగా ప్రకటించారు. ఈ మేరకు ఏపీ విద్యాశాఖ వివరాలను పేర్కొంది. పదో తరగతి అర్హత పొందిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. ప్రస్తుతం పరీక్ష రాసే వారు కూడా అప్లయ్ చేసుకోవచ్చు.



Source link

Related posts

Irdai New Rules For High Surrender Value On Life Insurance Policy | Insurance: బీమా పాలసీ సరెండర్ రూల్స్‌

Oknews

TSPSC ready to release Group 1 Notification Soon

Oknews

ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనాలు, విదేశాలు చెక్కేసిన కీలక సూత్రధారులు- ప్రముఖులు, వ్యాపారులపై నిఘా-hyderabad phone tapping case sib ex chief prabhakar rao ex dcp radha kishan rao played key role escaped to america ,తెలంగాణ న్యూస్

Oknews

Leave a Comment