Latest NewsTelangana

TS PGECET 2024 Notification released online application process starting from March 16 | TS PGECET 2024: టీటీఎస్‌ పీజీఈసెట్‌ నోటిఫికేషన్ విడుదల, మార్చి 16 నుంచి దరఖాస్తులు


TS PGECET-2024 Notification: తెలంగాణలోని పీజీ కళాశాలల్లో 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి ఎంఈ, ఎంటెక్, ఎంఆర్క్, ఎంఫార్మసీ, ఫార్మా-డి కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ‘TS PGECET-2024’ నోటిఫికేషన్ మార్చి 12న విడుదలైంది. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి పక్షాన జేఎన్‌టీయూ హైదరాబాద్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థుల నుంచి మార్చి 16 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. అభ్యర్థులు ఎలాంటి ఆల‌స్య రుసుం లేకుండా మే 10 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.1100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.600 చెల్లిస్తే సరిపోతుంది. 

దరఖాస్తుల సవరణకు మే 14 నుంచి 16 మ‌ధ్య అవ‌కాశం క‌ల్పించారు. ఇక రూ.250 ఆల‌స్య రుసుంతో మే 14 వ‌ర‌కు, రూ. 1000 ఆలస్య రుసుముతో మే 17 వరకు, రూ.2,500 ఆలస్య రుసుముతో మే 21 వరకు, రూ.5,000 ఆల‌స్య రుసుంతో మే 25 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తులు స్వీకరించనున్నారు. మే 28 నుంచి టీఎస్ పీజీఈసెట్ వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జూన్ 6 నుంచి 9 వరకు పీజీఈసెట్ పరీక్షలు నిర్వహించనున్నారు.

వివరాలు…

* టీఎస్‌పీజీఈసెట్ 2024 నోటిఫికేషన్

అర్హత: అభ్యర్థులు బీఈ/బీటెక్/బీఆర్క్/ బీప్లానింగ్/బీఫార్మసీ, ఎంఏ/ఎంఎస్సీ (సోషియాలజీ, ఎకనామిక్స్, జియోగ్రఫీ) ఉత్తీర్ణులై ఉండాలి. 

దరఖాస్తు ఫీజు: అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.1100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.600 చెల్లిస్తే సరిపోతుంది. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: ప్రవేశ పరీక్షలో ర్యాంకు ఆధారంగా.

పరీక్ష విధానం:
మొత్తం 120 మార్కులకు కంప్యూటర్ విధానంలో రాతపరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 120 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు ఉంటుంది. పరీక్ష సమయం 2 గంటలు. పరీక్షలో ఎలాంటి నెగెటివ్ మార్కులు లేవు, పరీక్షలో కనీస అర్హత మార్కులను 25 శాతం (30 మార్కులు)గా నిర్నయించారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఎలాంటి అర్హత మార్కులు ఉండవు. ప్రవేశ పరీక్షలో వచ్చిన ర్యాంకు ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.

పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, వరంగల్.

ముఖ్యమైన తేదీలు..

➥  పీజీసెట్‌ నోటిఫికేషన్‌: 12-03-2024.

➥  ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం:  16-03-2024.

➥  ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేదీ (అపరాధ రుసుము లేకుండా): 10-05-2024.

➥ దరఖాస్తుల సవరణ: 14-05-2024 – 16-05-2024.

➥ రూ.250 ఆల‌స్య రుసుముతో దరఖాస్తుకు చివరితేదీ: 14-05-2024.

➥ రూ.1000 ఆల‌స్య రుసుముతో దరఖాస్తుకు చివరితేదీ: 17-05-2024.

➥ రూ.2500 ఆల‌స్య రుసుముతో దరఖాస్తుకు చివరితేదీ: 21-05-2024.

➥ రూ.5000 ఆల‌స్య రుసుముతో దరఖాస్తుకు చివరితేదీ: 25-05-2024.

➥ హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌: 28-05-2024 నుంచి.

➥  పరీక్ష తేదీలు: 06-06-2024 – 09-06-2024 వరకు.

Notification

Examination Schedule

 Syllabus

Website

ALSO READ:

టీఎస్ ఎడ్‌సెట్‌-2024 పరీక్ష విధానం, సిలబస్ వివరాలు ఇలా
తెలంగాణలోని బీఈడీ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్‌ఎడ్‌సెట్-2024 (TS EDCET-2024) నోటిఫికేషన్ మార్చి 4న విడుదలైన సంగతి తెలిసిందే. అభ్యర్థుల నుంచి మార్చి 6 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అభ్యర్థులు ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా మే 6 వరకు, రూ.250 ఆలస్య రుసుంతో మే 13 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 23న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రవేశపరీక్ష నిర్వహించనున్నారు. ఈ ఏడాది నల్గొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఎడ్‌సెట్ పరీక్షల బాధ్యతను చేపట్టింది.
ఎడ్‌సెట్ నోటిఫికేషన్, దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి



Source link

Related posts

Crazy news on Rakul Preet wedding రకుల్ ప్రీత్ పెళ్లి పై క్రేజీ న్యూస్

Oknews

Congress Screening Committee Meeting In Delhi To Finalize Candidates

Oknews

ప్రభాస్ ది ఏడవ ప్లేస్ కాదు no 1 స్థానమే.. ప్రూఫ్ కూడా ఉంది 

Oknews

Leave a Comment