Latest NewsTelangana

TSGENCO Assistant Engineer and chemist Hall Ticket release delayed due to LS Polls Check official notice here | TSGENCO ఏఈ, కెమిస్ట్ పరీక్షలు వాయిదా?


TSGENCO Recruitment Exams:: తెలంగాణ రాష్ట్ర పవర్ జెనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్‌(TSGENCO)‌లో అసిస్టెంట్ ఇంజినీర్(ఏఈ), కెమిస్ట్ పోస్టుల భర్తీకి నిర్వహించనున్న ఆన్‌లైన్ రాతపరీక్షలు వాయిదా పడే అవకాశం కనిపిస్తుంది. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మార్చి 31న నియామక పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను మార్చి 23న విడుదల చేయాల్సి ఉంది. అయితే మార్చి 16న లోక్‌సభ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో పరీక్ష నిర్వహణపై అధికారులు అయోమయంలో పడ్డారు. ఎన్నికల సంఘం నుంచి అనుమతి వస్తేనే పరీక్షల నిర్వహణకు మార్గం సుగమం అవుతుంది. ఈసీ నుంచి అనుమతి రాగానే హాల్‌టికెట్లను విడుదల చేసి, పరీక్ష నిర్వహిస్తారు. ఒకవేళ లేకపోతే సార్వత్రిక ఎన్నికల తర్వాతే పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది.   

TSGENCO ఏఈ, కెమిస్ట్ పరీక్షలు వాయిదా? - ఈసీ అనుమతిస్తేనే నిర్వహించే అవకాశం

తెలంగాణ రాష్ట్ర పవర్ జెనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్‌(TSGENCO)‌లో అసిస్టెంట్ ఇంజినీర్, కెమిస్ట్ పోస్టుల భర్తీకి గతేడాది అక్టోబరు 5న నోటిఫికేషన్లు వెలువడిన సంగతి తెలసిందే. దీనిద్వారా 339 ఏఈ పోస్టులు, 60 కెమిస్ట్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థుల నుంచి అక్టోబరు 7 నుంచి నవంబరు 10 వరకు దరఖాస్తులు స్వీకరించారు. అభ్యర్థుల నుంచి దరఖాస్తు ఫీజుగా రూ.400, పరీక్ష ఫీజుగా రూ.300 వసూలుచేశారు. అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపునిచ్చారు. అయితే ఇతర రాష్ట్రాలకు చెందిన వారికి మినహాయింపు ఇవ్వలేదు.

పోస్టుల వివరాలు..

➥ అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ)

ఖాళీల సంఖ్య: 339 (లిమిటెడ్-94, జనరల్-245)

పరీక్ష విధానం: మొత్తం 100 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో రెండు సెక్షన్ల నుంచి 100 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు ఉంటుంది. ‘సెక్షన్-ఎ’లో అభ్యర్థుల సబ్జెక్ట్ (కోర్ టెక్నికల్) నుంచి 80 ప్రశ్నలు-80 మార్కులు, ‘సెక్షన్-బి’లో ఇంగ్లిష్, జనరల్ అవేర్‌నెస్, అనలిటికల్ & న్యూమరికల్ ఎబిలిటీ, తెలంగాణ హిస్టరీ, కల్చర్, తెలంగాణ ఆవిర్భావం, అభివృద్ధి, కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి 20 ప్రశ్నలు-20 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం 2 గంటలు (120 నిమిషాలు). 

పేస్కేలు: రూ.65,600 – రూ.1,31,220 (RPS-2022).

నోటిఫికేషన్, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..

➥ కెమిస్ట్ పోస్టులు

ఖాళీల సంఖ్య: 60 (లిమిటెడ్-03, జనరల్-57)

పరీక్ష విధానం: మొత్తం 100 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో రెండు సెక్షన్ల నుంచి 100 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు ఉంటుంది. ‘సెక్షన్-ఎ’లో అభ్యర్థుల సబ్జెక్టు (కోర్ టెక్నికల్) నుంచి 80 ప్రశ్నలు-80 మార్కులు, ‘సెక్షన్-బి’లో ఇంగ్లిష్, జనరల్ అవేర్‌నెస్, అనలిటికల్ & న్యూమరికల్ ఎబిలిటీ, తెలంగాణ హిస్టరీ, కల్చర్, తెలంగాణ ఆవిర్భావం, అభివృద్ధి, కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి 20 ప్రశ్నలు-20 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం 2 గంటలు (120 నిమిషాలు). 

పేస్కేలు: రూ.65,600 – రూ.1,31,220 వరకు ఇస్తారు.

నోటిఫికేషన్, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..

ఉద్యోగాలకు ఎంపికైనవారు సంస్థలో విధిగా 5 సంవత్సరాలు పనిచేయనున్నట్లు సర్వీస్ బాండ్ సమర్పించాల్సి ఉంటుంది. ఇందులో రెండేళ్ల ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. ఈ ప్రొబేషన్ పీరియడ్‌లో ఏడాదిపాటు శిక్షణ ఉంటుంది. రెండళ్లే ప్రొబేషన్ పీరియడ్‌లో ఉద్యోగం వదిలి వెళితే, నష్టపరిహారం కింద అభ్యర్థుల నుంచి రూ.50,000 వసూలు చేస్తారు. ఇక ప్రొబేషన్ పీరియడ్ తర్వాత ఉద్యోగం వదిలి వెళితే.. రూ.1లక్ష రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి



Source link

Related posts

Politics that will not leave NTR! ఎన్టీఆర్‌ను వదలని రాజకీయం!

Oknews

తెలంగాణ ఈఏపీసెట్‌ కు ప్రిపేర్ అవుతున్నారా..? ఫ్రీగా ఇలా ‘మాక్‌ టెస్టులు’ రాసుకోవచ్చు-ts eapcet 2024 mock tests can be written for free see these direct links ,తెలంగాణ న్యూస్

Oknews

ఇండస్ట్రీ అంతా ఒకే వెబ్ సిరీస్ లో.. అదేంటంటే!

Oknews

Leave a Comment