జస్ట్ మిస్. ఈ టీ20 వరల్డ్ కప్ లో మరో సంచలనం నమోదయ్యేది. లీగ్ దశ ముగించుకుని సూపర్ 8లోకి అడుగుపెట్టిన టీమ్స్ రెండో దశ మ్యాచ్ లను ఆసక్తికరంగా ప్రారంభించాయి. ప్రత్యేకించి గ్రూప్ B బాగా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్న USA టీమ్…సౌతాఫ్రికా మీద పెను సంచలనాన్ని నమోదు చేసేదే. ముందు బ్యాటింగ్ చేసి సౌతాఫ్రికా పెట్టిన 195 పరుగులు టార్గెట్ ను ఛేజ్ చేసేయాలనే ఇంటెంట్ తో USA కనిపించటమే మ్యాచ్ లో ఆసక్తిని పెంచేసింది. ప్రత్యేకించి అమెరికా ఓపెనర్, వికెట్ కీపర్ ఆంద్రీస్ గౌస్, లోయర్ మిడిల్ ఆర్డర్ హర్మీత్ సింగ్ తో కలిసి సౌతాఫ్రికా మీద పెద్ద స్కెచ్చే వేశాడు. ఆఖరి నాలుగు ఓవర్లలో 60పరుగులు చేస్తే కానీ USA గెలవదన్న పొజిషన్ నుంచి రెండు ఓవర్లలో 28పరుగులు చేస్తే చాలు అన్న పొజిషన్ కు వీళ్లిద్దరూ మ్యాచ్ ను తీసుకొచ్చేసి సౌతాఫ్రికాను టెన్షన్ పెట్టారు. గౌస్ 47బాల్స్ లో ఐదు ఫోర్లు, ఐదు సిక్సర్లతో 80పరుగులు చేసి నాటౌట్ గా నిలిస్తే…22 బాల్స్ లో 2ఫోర్లు, 3సిక్సర్లతో 38పరుగులు చేసిన హర్మీత్ సింగ్ ఆరో వికెట్ కు 91పరుగులు జోడించారు. కానీ చివర్లో రబాడా హర్మీత్ సింగ్ ను ఔట్ చేయటంతో USA కథ ముగిసిపోయింది.