దిశ, ఫీచర్స్: వెల్లుల్లి ప్రయోజనాలు ఒకటి కాదు రెండు కాదు అనేకం. వీటిలో బి1, బి2, బి3, బి6, ఐరన్, కాల్షియం, విటమిన్ సి,మెగ్నీషియం, మాంగనీస్, పొటాషియం, ఫాస్పరస్, సోడియం, జింక్ వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. వెల్లుల్లిలోని యాంటీఆక్సిడెంట్ లక్షణాల వల్ల కొలెస్ట్రాల్ కంట్రోల్‌లో ఉంటుంది. ప్రతిరోజూ వెల్లుల్లి తింటే మీ ఇమ్యూనిటి పవర్ పెరుగుతుంది, రక్తపోటును తగ్గిస్తుంది, గుండె జబ్బుల ప్రమాదాన్ని, షుగర్‌ను అదుపులో ఉంచడం.. ఇలా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.
వెల్లుల్లిలో సహజ సమ్మేళనాలు ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది. ముఖ్యంగా భారతీయ మహిళలు వెల్లుల్లి రెబ్బల్ని వంటకాల్లో ఉపయోగిస్తారు. వెల్లుల్లి యాడ్ చేయడం వల్ల వంటలు మంచి రుచి, సువాసన ఇస్తుంది. ఎన్నో ఔషధ గుణాలతో కూడుకున్న వెల్లుల్లి పురాతన కాలం నుంచి ఎన్నో వ్యాధుల ట్రీట్‌మెంట్‌కు ఒక ఔషధంగా యూజ్ అవుతుంది.
అయితే ఇన్ని ప్రయోజనాలున్న వెల్లుల్లి తినడమే కాకుండా పడుకొనేటప్పుడు దిండు కింద పెట్టుకోవడం వల్ల పలు ప్రయోజనాలున్నాయంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు చూద్దాం.. వెల్లుల్లి రాత్రి పడుకునే ముందు దిండు కింద పెట్టుకోవడం వల్ల ప్రశాంతంగా నిద్ర పడుతుందట. అలాగే గది మొత్తం సానుకూల శక్తిని సృష్టిస్తుందట. పడుకునే ముందు దిండు కింద వెల్లుల్లి పెట్టుకోవడం వల్ల దోమల బెడద తగ్గుతుందట.రూం మొత్తం మంచి సువాసనను వెదజల్లుతుంది. ఫలితంగా దగ్గు, జలుబు రాకుండా ఉంటాయి. పూర్వకాలంలో వెల్లుల్లిని ఇంట్లో నలుమూలల వేసేవారట. దీంతో బ్యాక్టీరియా నశించిపోతుందని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ సమాచారం ఇంటర్నెట్ ద్వారా సేకరించబడింది. దీనిని దిశ ధృవీకరించలేదు