ByGanesh
Thu 29th Feb 2024 04:07 PM
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ సమీకరణాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. వైసీపీలో అసంతృప్తులంతా దాదాపు బిచానా సర్దేశారు. ఇక ఇప్పుడు టీడీపీ, జనసేన వంతు. ఎవరు.. ఎప్పుడు.. ఎక్కడ ఉంటారో తెలియని పరిస్థితి. వైసీపీ నుంచి చాలా మంది జంప్ అయ్యారు కాబట్టి ఇప్పుడు టీడీపీ, జనసేనల్లో తేడాలొస్తే తాము క్యాష్ చేసుకోవాలని వైసీపీ భావిస్తోంది. తొలి జాబితా ప్రకటన తర్వాత ఈ పార్టీల్లో వికెట్స్ పడటం ప్రారంభమైంది. టీడీపీ, జనసేనల్లో అసంతృప్తులందరినీ వైసీపీ చటుక్కున లాగేస్తోంది. ముఖ్యంగా విజయవాడ ఈ మధ్య కాలంలో హాట్ టాపిక్‌గా మారింది. ఎంపీ కేశినేని నాని టీడీపీని వీడి వైసీపీలో చేరడం.. ఆ తరువాత టీడీపీ సీనియర్ నేత జలీల్ ఖాన్ సైతం పార్టీ మారేందుకు సన్నాహాలు చేసుకోవడం వంటివి ఇప్పటికే జరిగాయి.
బందర్ ఎంపీ సీటును ఆఫర్ చేస్తున్న వైసీపీ..
ఇక ఇప్పుడు హాట్ టాపిక్.. వంగవీటి రాధ. టీడీపీ నుంచి ఆయన విజయవాడ సెంట్రల్, ఈస్ట్ టికెట్లను ఆశించారు. టీడీపీ విడుదల చేసిన తొలి జాబితాలో ఈ రెండు సీట్లను చంద్రబాబు వేరే వారికి ప్రకటించేయడంతో రాధ అసంతృప్తిలో ఉన్నారని తెలుస్తోంది. దీనిని క్యాష్ చేసుకునేందుకు వైసీపీ యత్నిస్తోంది. వైసీపీ ప్రస్తుతం కాపు నేతలను టార్గెట్ చేస్తోంది. ఈ క్రమంలోనే వంగవీటి రాధాను తిరిగి వైసీపీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. రాధతో ఇప్పటికే మాజీ మంత్రులు పేర్ని నాని, కొడాలి నానిలు మంతనాలు జరిపారు. వంగవీటి రాధకు వైసీపీ అధిష్టానం బందర్ ఎంపీ సీటును ఆఫర్ చేస్తోందని టాక్. అయితే వైసీపీ కూడా రాధ కోరుకున్న స్థానాన్ని ఇచ్చేందుకు సుముఖంగా ఏమీ లేదు. అయితే వంగవీటి రాధకు మంచి స్నేహితులైన ఇద్దరు నానిలు వెళ్లి కలవడం మాత్రం ఆసక్తికర చర్చకు దారి తీస్తోంది.
ఆహ్వానంపై రాధ ఏం చేస్తారు?
అయితే కొడాలి నాని, రాధ అప్పుడప్పుడు కలుస్తూనే ఉంటారు. కలిసిన ప్రతిసారీ పార్టీ మార్పు ప్రచారమే జరుగుతోంది. ఆ మధ్య వంగవీటి రంగ వర్ధంతి సందర్భంగా రాధ కాశీలో పిండ తర్పణం చేశారు. ఆ సమయంలో రాధతో పాటు కొడాలి నాని కూడా కాశీ వెళ్లారు. అప్పుడు కూడా పార్టీ మార్పు ప్రచారం జరిగింది. అయితే వంగవీటి రాధ మాత్రం ఇప్పటి వరకూ ఆ దిశగా అడుగులు వేసిందైతే లేదు. ఇప్పుడు ఎన్నికల సమయంలో మరోసారి ప్రచారం ఊపందుకుంది. అయితే కొడాలి నాని.. వంగవీటి రాధ ఇద్దరూ కలిస్తే వారి మధ్య పార్టీల ప్రస్తావన వస్తుందో రాదో తెలియదు కానీ ఈసారి మాత్రం నేరుగా వైసీపీలోకి ఆహ్వానించారట. మరి ఈ ఆహ్వానంపై రాధ ఏం చేస్తారు? నిర్ణయం తీసేసుకుని వైసీపీలోకి జంప్ అవుతారా? లేదంటే సున్నితంగా తిరస్కరిస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది.
Vangaveeti Radha to Join in YCP:
Vangaveeti Radha Contest As YSRCP Bandar MP