ముగ్గురు కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు…అవినీతి ఆరోపణలతో సిఐని బదిలీ చేసిన పోలీస్ బాస్… వేములవాడ లో (Vemulawada Police)పని చేసే 9 మంది కానిస్టేబుళ్ళ ను హెడ్ క్వార్టర్ కు అటాచ్డ్ చేశారు. అమ్యామ్యాలకు అలవాటు పడ్డ శంకర్, అరుణ్ సురేశ్ ముగ్గురిని ఎస్పీ సస్పెండ్ చేశారు. మరో ఐదుగురు కానిస్టేబుళ్ళు, ఐదుగురు హోంగార్డులను ఇటీవల హెడ్ క్వార్టర్ కు అటాచ్ చేశారు. అడ్డదారిలో అవినీతికి పాల్పడే వారికి షాక్ ఇచ్చేలా పోలీస్ బాస్ చర్యలు చేపట్టడంతో సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. దైవ భక్తితో వచ్చే భక్తులు స్వామివారికి సమర్పించే బెల్లం పక్క దారి పడుతుందని వ్యాపారులను వేధిస్తూ వసూళ్ళకు పాల్పడడంతోనే చర్యలు చేపట్టినట్లు వేములవాడ భక్తజనం భావిస్తుంది.
Source link