ByGanesh
Thu 04th Apr 2024 01:15 PM
విజయ్ దేవరకొండ-రష్మిక ఇద్దరూ డేటింగ్ లో ఉన్నారనే న్యూస్ కొన్నేళ్లుగా సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంది. మేము ఫ్రెండ్స్ అని ఎన్నిసార్లు మొత్తుకున్నా మీడియా మాత్రం వాళ్ళని అనుమానిస్తూనే ఉంది. ఇందులో మీడియా తప్పేమి లేదు. విజయ్ దేవరకొండ-రష్మిక న్యూ ఇయర్ కి, లేదంటే సమ్మర్ కి కలిసి వెకేషన్స్ కి వెళుతూ ఉంటారు. అది కూడా సీక్రెట్ గా వెళ్లడంతో మీడియా విపరీత అర్ధాలు తీస్తూ ఉంటుంది.
ఇప్పుడు కూడా విజయ్ దేవరకొండ దుబాయ్ లో రష్మిక బర్త్ డే ని సెలెబ్రేట్ చేస్తున్నాడు. ఇప్పటికే వీరిద్దరూ దుబాయ్ చెక్కేశారనే వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. రేపు విజయ్ దేవరకొండ నటించిన ఫ్యామిలీ స్టార్ విడుదలవుతుంది, అదే రోజు అంటే ఏప్రిల్ 5 న రష్మిక బర్త్ డే. సో రష్మిక బర్త్ డే ని విజయ్ దుబాయ్ లో సెలెబ్రేట్ చేస్తున్నాడనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ చెన్నైలో ఎక్కువ థియేటర్స్ లో విడుదలవుతుంది అంటూ ఓ వీడియో వదిలాడు. అందులో
ఆయన వెనుకగా నెమలి కనిపించింది. మరోపక్క రష్మిక అదే మాదిరి పార్క్ లో నెమలి ఉన్న పిక్ ని సోషల్ మీడియాలో షేర్ చెయ్యడంతో విజయ్-రష్మిక కలిసే ఉన్నారని మీడియా డిసైడ్ అయ్యింది. విజయ్-రష్మీకల పిక్స్ పక్క పక్కన పెట్టి ఇదిగో చూడండి, విజయ్ రష్మిక బర్త్ డే ని సెలెబ్రేట్ చేసేందుకు దుబాయ్ వెళ్ళాడు అంటూ ఆ పార్క్ ఫొటోస్ ని షేర్ చేస్తూ హడావిడి మొదలు పెట్టారు.
Vijay Devarakonda to celebrate Rashmika B-Day in Dubai:
Rashmika to celebrate B-Day with Vijay Devarakonda in Dubai