Health Care

viral : ఓర్నీ.. పెళ్లైన మూడు నిమిషాలకే అదేం పని.. ఒక్కరోజు కూడా ఆగలేకపోయారా!


దిశ, ఫీచర్స్ : పెళ్లంటే మూడు ముళ్ల బంధమే కాదు, నూరేండ్ల అనుబంధంగా అభివర్ణిస్తుంటారు పెద్దలు. ఒక్కసారి మ్యారేజ్ అయిందంటే కలకాలం కలిసే ఉంటారని నమ్ముతారు. ఒకప్పుడు ఇది 99 శాతం నిజం అయ్యేదేమో కానీ, ఇప్పుడంత కచ్చితంగా చెప్పలేమంటున్నారు ఫ్యామిలీ అండ్ రిలేషన్‌షిప్ కౌన్సెలింగ్ ఎక్స్‌పర్ట్స్. ఎందుకంటే.. ప్రపంచ వ్యాప్తంగా కూడా రిలేషన్‌షిప్స్‌‌లో మార్పులు చోటు చేసుకుంటున్నాయని చెప్తున్నారు. 

పరస్పర నమ్మకం, పరస్పరగౌరవం, ప్రేమ, ఆప్యాయతలు, స్వేచ్ఛ, సమానత్వం వంటి అంశాలు ఇప్పుడు సంబంధాల్లో కీ రోల్ పోషిస్తున్నాయి. ఇవన్నీ ఇరువైపులా లేదా ఏదో ఒకవైపు లోపించినప్పుడు అక్కడ బంధాలు విచ్ఛిన్నం కావచ్చు. అందుకు ప్రత్యేక కారణాలు ఉంటాయి. కానీ కొన్నిసార్లు అక్కడక్కడా సిల్లీ రీజన్స్‌తో కూడా కపుల్స్ గొడవ పడటం, చివరికి విడాకుల దాకా వెళ్లడం వంటి సంఘటలు ఈ మధ్య తరచుగా వైరల్ అవుతున్నాయి. అలాంటి ఓ సంఘటనే ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతూ నెటిజన్లలో క్యూరియాసిటీని పెంచుతోంది. ఓ జంట చేసిన పనికి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

వారి పేర్లయితే తెలియదు కానీ.. వైరల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం.. కువైట్‌కు చెందిన వధూ వరులు పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. మ్యారేజ్ రిజిస్ట్రేషన్ కోసం సంబంధిత అధాకారి ఎదుట సంతకాలు పెట్టడానికి వెళ్లారు. ఆ తర్వాత పెళ్లి వేడుక నుంచి బయలు దేరి వెళ్తుండగా.. పెళ్లి కూతురు సడెన్‌గా బ్యాలెన్స్ తప్పి పడిపోయింది. పక్కనే ఉన్న వరుడు వెంటనే ఆమెను ‘స్టుపిడ్’ అని దూషించాడు. ఇంకేముంది ఈ ఒక్క మాటతో వధువులో కోపం కట్టలు తెంచుకుంది. ‘సాయం చేయాల్సింది పోయి స్టుపిడ్ అంటూ నలుగురిలో అవమానిస్తావా? నీలాంటి వాడితో ఇక కాపురం చేయలేను నాకు డివోర్స్ కావాలి’ అంటూ వెంటనే అక్కడి నుంచి న్యాయవాది ఎదుట హాజరై తన గోడు చెప్పుకుంది. ఆమె ఏమాత్రం రాజీపడకపోవడంతో అందుకు న్యాయవాది కూడా ఓకే చెప్పేసి విడాకులను మంజూరు చేశాడు. పెళ్లి చేసుకోవడం.. ఆ తర్వాత మూడు నిమిషాల్లోనే విడాకులు కూడా తీసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రజెంట్ ఈ న్యూస్ నెట్టింట వైరల్ అవుతుండగా.. ‘ఓర్నీ.. గింత దానికే విడాకులా? ఇట్లయితే ఎట్లా?’ అంటూ కామెంట్లు పెడుతున్నారు పలువురు. 



Source link

Related posts

ఒక కిడ్నీ చెడిపోతే ఇంకో కిడ్నీతో ఎంత కాలం బతకవచ్చు.. నిపుణులు ఏం చెబుతున్నారంటే..?

Oknews

కాల్షియం కోసం పాలు తాగాల్సిన అవసరం లేదు.. వీటిని కూడా తీసుకోవచ్చు

Oknews

ఉద్యోగాలు చేస్తున్న తల్లుల్లో తమ బిడ్డ దూరమవుతుందన్న భయాలు.. నిపుణులు ఏమంటున్నారంటే..?

Oknews

Leave a Comment