Health Care

Viral Fever: రోజు రోజుకు పెరుగుతున్న వైరల్ ఫీవర్ కేసులు.. లక్షణాలు ఇవే


దిశ, ఫీచర్స్: వర్షాకాలం మొదలైదంటే చాలు.. ఎక్కడ లేని వ్యాధులు మొత్తం వస్తాయి. జలుబు, దగ్గు, గొంతు నొప్పి తో బాధ పడుతుంటారు. ఇమ్మ్యూనిటీ పవర్ తగ్గిన వారిలో ఎక్కువగా వైరల్ ఫీవర్ వస్తుంది. పసి పిల్లల నుంచి పెద్దల వరకు ఈ ఇన్‌ఫెక్షన్ కు గురవుతుంటారు.

ఈ వైరల్ ఫీవర్ అంటువ్యాధి. ఇది చాలా ఈజీగా వేరే వారికి సోకుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ వైరల్ జ్వరం వచ్చిన వ్యక్తి దగ్గినప్పుడు కానీ మాట్లాడినప్పుడు కానీ నోటి నుంచి వెలువడే తుంపరలలో ఉండే బ్యాక్టీరియా వేరే వ్యక్తి శరీరంలోకి వెళ్తుంది. ఈ విధంగా ఒకసారి శరీరంలోకి వెళ్లిన తర్వాత వైరల్ ఇన్‌ఫెక్షన్‌గా మారుతుంది.

వైరల్ ఫీవర్ లక్షణాలు

జ్వరం, నీరసం , చలి, లో బీపీ, గొంతునొప్పి, హిమోగ్లోబిన్ తగ్గిపోవడం, గొంతు మంట,చర్మం దద్దుర్లు, వాంతులు వంటివి లక్షణాలు కనిపిస్తాయి. ఇవి మీలో కనిపిస్తే అసలు నిర్లక్ష్యం చేయకండి. వైరల్ ఫీవర్ వచ్చిన పిల్లల్లో ఇమ్మ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటే వారిని జాగ్రత్తగా చూసుకోవాలి.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.



Source link

Related posts

ఆస్తమా అవస్థలు.. ఊపిరితిత్తులు, శ్వాసనాళాల్లో సమస్యలకు కారణాలను కనుగొన్న శాస్త్రవేత్తలు

Oknews

ప్రేమ గుడ్డిదేనా?.. కొందరు రాంగ్ పర్సన్‌ను లైఫ్ పార్టనర్‌గా ఎందుకు ఎంచుకుంటారు?

Oknews

స్నానం చేస్తున్నప్పుడు యూరిన్ చేస్తున్నారా? కానీ ఎవరితో చెప్పుకోలేక పోతున్నారా?

Oknews

Leave a Comment