చిరుతపులి, పెద్దపులి విశేషణాలు ఏవైనా సరే విరాట్ కొహ్లీ బ్యాటింగ్ ముందు దిగదుడుపే. కింగ్ ఫామ్ లో ఉంటే అతడి బ్యాట్ కి బలవ్వని బౌలరే లేడు. మోడ్రన్ డే క్రికెట్ లో అన్ డౌటెడ్ లీ లెజెండ్ అనే స్థాయి ఆపాదించగల ఆటగాడు ఎవరైనా ఉన్నారు అంటే అది విరాట్ కొహ్లీ. సచిన్ తర్వాత ఆస్థాయిలో పరుగుల యంత్రంలా మారిపోయి, రికార్డుల మీద రికార్డులను బ్రేక్ చేస్తూ గోట్ అనిపించుకున్నాడు విరాట్ కొహ్లీ. అలాంటి కొహ్లీ ఈ సారి వరల్డ్ కప్ లో ఘోరంగా విఫలమవుతున్నాడు. ఇప్పటి వరకూ ఈ వరల్డ్ కప్ లో ఐదు మ్యాచులు ఆడిన కింగ్…చేసింది కేవలం 65పరుగులు మాత్రమే. అందులోనూ రెండు సార్లు డకౌట్ అయ్యాడు. మరో ఓపెనర్ సహచరుడు రోహిత్ శర్మ ఐర్లాండ్ మీద హాఫ్ సెంచరీతో వరల్డ్ కప్ ను ప్రారంభించి మొన్న ఆస్ట్రేలియా మీద 92పరుగుల బాదటం ద్వారా టచ్ లోకి వచ్చేశాడు. కానీ కొహ్లీ నే ఇప్పటివరకూ ఒక్క మ్యాచూ తన స్థాయిలో ఆడలేకపోయాడు. టీమిండియాకు హెల్ప్ కాలేకపోయాడు. కానీ ఇప్పుడు టైగర్ కి టైమొచ్చింది. కళ్ల ముందున్న ఇంగ్లండ్ తో సెమీఫైనల్ అండ్ ఆ తర్వాత ఫైనల్ ఈ రెండు మ్యాచులు కింగ్ చెలరేగిపోయి ఆడితే చాలు టీమిండియా చేతుల్లో టీ20 వరల్డ్ కప్ వచ్చి చేరుతుంది. లాస్ట్ టీ20 వరల్డ్ కప్ లో పాకిస్థాన్ మీద చరిత్ర చూడని షాట్లతో రెచ్చిపోయి తనెంతటి పోటుగాడినో నిరూపించుకున్న విరాట్ కొహ్లీ అలాంటి ఇన్నింగ్స్ మరో రెండు ఆడితే చాలు భారత క్రికెట్ అభిమానులు పండుగు చేసుకోవటం ఖాయం. ఫామ్ కోల్పోవటం అనేది ప్రతీ క్రికెటర్ లైఫ్ లో జరుగుతూ ఉండేది. కొహ్లీ కి ఇంతకు ముందుకు కూడా చాలా సార్లు జరిగింది. కానీ విరాట్ కొహ్లీ కమ్ బ్యాక్స్ ఎవరూ ఊహించని స్థాయిలో ఉంటాయి. తను ఆడలేనప్పుడు మాట్లాడిన ప్రతీ వాడి నోరు మూయించేలా ఎవడికి ఇవ్వాల్సింది వాడికిచ్చేస్తాడు. సో ఆ కసి ఆ పట్టుదల తో కింగ్ ఈ రోజు ఇంగ్లండ్ ను ఇరగదీయాలని మచ్చల పులి వేట మర్చిపోలేదు జస్ట్ మాటు వేసి ఉందే అని బలంగా చాటుకోవాలని అందరి కోరిక.
క్రికెట్ వీడియోలు
Virat Kohli Batting T20 World Cup 2024 | సెమీ ఫైనల్లోనైనా కింగ్ కమ్ బ్యాక్ ఇస్తాడా..? | ABP Desam
మరిన్ని చూడండి