ఇన్నేళ్లుగా చూస్తున్నామా మ్యాచ్ అంటే చాలు ఎక్కడ లేని కసి చూపించే కింగ్ విరాట్ కొహ్లీ..చూడటానికి కామ్ గా ఉన్నా షర్ట్ తడిసిందంటే చాలు శివాలెత్తిపోయే హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఎక్కడకి వెళ్లిపోయారు వీళ్లిద్దరూ. కాస్కో ఇస్కిస్తో మీ ఇద్దరూ ఆడండయ్యా అనే ప్రతీ క్రికెట్ ఫ్యానూ కోరుకుంటున్నాడు. ఐపీఎల్ లో మంచి జోరు చూపించిన ఈ ఇద్దరూ టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా తరపున రన్స్ చేయాల్సి వచ్చేప్పటికి అకస్మాత్తుగా ఫామ్ కోల్పోయారు. కొహ్లీ అయితే మరీ దారుణం ఒక్క యూఎస్ఏ తో మ్యాచ్ లో 24బాల్స్ లో 24 పరుగులు చేయటం తప్ప ఈ వరల్డ్ కప్ లో పట్టుమని పది పరుగులు దాటడానికి కూడా ఆపసోపాలు పడుతున్నాడు. రోహిత్ శర్మ కూడా అంతే ఐర్లాండ్ మీద మ్యాచ్ లో హాఫ్ సెంచరీ కొట్టాడు కానీ మిగిలిన మ్యాచుల్లో తుస్ టపాస్. అసలు వరల్డ్ కప్పులో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితా అని ఒకటి ఉంటుంది కదా. ఇదిగో ఇదే అది. యూఏఎస్ ఏ ఆటగాడు గౌస్ 5 మ్యాచుల్లో 211 పరుగులతో టేబుల్ టాపర్ గా ఉంటే..నికోలస్ పూరన్ రెండోస్థానంలో ఉన్నాడు. మరి ఇందులో మన కెప్టెన్ రోహిత్ శర్మ ఎక్కడ ఉన్నాడో చూశారా ఇదిగో ఇక్కడ 45వ స్థానంలో. ఇక విరాట్ భయ్యా ప్లేస్ ఎక్కడో తెలుసా..ఇక్కడ 114వ స్థానం. నాకు తెలిసి వీళ్లిద్దరి కెరీర్ లోనే అత్యంత ఘోరమైన ఫామ్ ను కనబరుస్తున్న సిరీస్ ఇది. ఇంతకు ముందు కొన్ని సిరీస్ ల్లో ఇద్దరూ ఫెయిల్ అయ్యి ఉండొచ్చు..ఆటగాడిగా ఇది సహజం కూడా అయ్యి ఉండవచ్చు. కానీ ఐసీసీ ట్రోఫీల కోసం జరిగే వరల్డ్ కప్ లాంటి భారీ టోర్నీలో ఈ ఇద్దరూ ఓపెనర్లు ఇలా నీరసం తెప్పిస్తుండటం మాత్రం టీమిండియా ఫ్యాన్స్ కే చిరాకు తెప్పిస్తోంది. ఈ రోజు బంగ్లాతో మ్యాచ్ లోనైనా ఈ ఇద్దరూ ఫామ్ లోకి వస్తే…క్రూషియల్ స్టేజ్ లో భారత్ కు కొండంత బలం చేకూరినట్లే
క్రికెట్ వీడియోలు
Virat Kohli Rohit Sharma Poor Batting | T20 World Cup ఆడుతున్నా..కిక్కు రావట్లేదంటే మీరే కారణం | ABP
మరిన్ని చూడండి