అయోధ్యలో జనవరి 22న జరగనున్న రామ మందిర ప్రాణప్రతిష్ఠ వేడుకకు దేశవ్యాప్తంగా ఉన్న దిగ్గజ క్రీడాకారులకు ఆహ్వానాలు అందాయి. క్రికెట్‌ గాడ్‌ సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar), భారత్‌కు రెండుసార్లు ప్రపంచకప్‌ అందించిన మిస్టర్ కూల్‌ MS ధోనీ( MS Dhoni), ప్రస్తుత భారత కెప్టెన్ రోహిత్ శర్మ, చెస్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ సహా దిగ్గజ క్రీడాకారులు అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ఠకు ఆహ్వానాలు అందుకున్నారు. భారత మాజీ కెప్టెన్లు విరాట్ కోహ్లీ(Virat Kohli), సౌరవ్ గంగూలీ, అనిల్ కుంబ్లే కూడా ఆహ్వానాలు అందుకున్నావారిలో ఉన్నారు. వెయిట్‌లిఫ్టర్ కరణం మల్లీశ్వరి, ఫుట్‌బాల్ క్రీడాకారిణి కళ్యాణ్ చౌబే, లాంగ్‌ డిస్టాన్స్‌ రన్నర్‌ కవితా రౌత్ తుంగార్, పారాలింపిక్ జావెలిన్ త్రోయర్ దేవేంద్ర జంజాడియాలకు కూడా ఆహ్వానాలు అందాయి, మహిళా క్రికెట్ కెప్టెన్ మిథాలీ రాజ్, స్టార్‌ షట్లర్లు సైనా నెహ్వాల్, పీవీ సింధు, కోచ్‌ పుల్లెల గోపీచంద్ కూడా ఉన్నారు. కపిల్ దేవ్, ‘లిటిల్ మాస్టర్’ సునీల్ గవాస్కర్, వీరేంద్ర సెహ్వాగ్, రవీంద్ర జడేజా, టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ కూడా ఈ జాబితాలో ఉన్నారు. పీటీ ఉష, భైచుంగ్ భూటియాలకు కూడా అయోధ్య ఆహ్వానం అందింది.

అశ్విన్‌కు ఆహ్వానం
తాజాగా మరో భారత స్టార్‌ క్రికెటర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌కు ఆహ్వానం అందింది. తమిళనాడు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌జీ సూర్య, ఉపాధ్యక్షుడు వెంకట్రామన్‌ అశ్విన్‌కు ఆహ్వాన పత్రికతో పాటు అక్షతలు అందజేశారు. ఇప్పటికే ఇప్పటికే ప్రముఖ క్రికెటర్లు సచిన్‌, ధోని, కోహ్లీ… సినీ ప్రముఖులు అక్షయ్‌ కుమార్‌, కంగనా రనౌత్‌, టైగర్‌ ష్రాఫ్‌, జాకీ ష్రాఫ్‌, హరిహరన్‌, రజనీకాంత్‌, అమితాబ్‌ బచ్చన్‌, చిరంజీవి, రణ్‌బీర్‌ కపూర్‌, అలియా భట్‌, రణ్‌దీప్‌ హుడాలకు ఇప్పటికే ఆహ్వానాలందాయి.

విరుష్క దంపతులకు ఆహ్వానం
దాదాపు 55 దేశాలకు చెందిన వంద మంది ఎంపీలు, రాయబారులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు ఆహ్వానాలు ఇచ్చినట్లు ప్రపంచ హిందూ ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు స్వామి విజ్ఞానానంద తెలిపారు. శ్రీరాముని వంశానికి చెందిన వారిగా చెప్పుకునే కొరియన్‌ రాణికి కూడా ఆహ్వానించినట్లు వెల్లడించారు. బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి భారత్ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, అనుష్క దంపతులకు…. ఆహ్వానం అందింది. ముంబయి(Mumbai)లోని కోహ్లీ నివాసానికి వెళ్లిన ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వాన పత్రిక అందజేశారు. అఫ్గాన్‌నిస్థాన్‌(Afghanistan)తో మూడో టీ20 ఆడటానికి బెంగళూరు బయల్దేరడానికి ముందు స్వయంగా ఆహ్వానాన్ని స్వీకరించడానికి కోహ్లీ ముంబయికి వచ్చినట్లు తెలుస్తోంది. వేడుకకు వెళ్లేందుకు విరాట్ కొహ్లీ బీసీసీఐ అనుమతి కూడా తీసుకున్నారు. దాదాపు 55 దేశాలకు చెందిన వంద మంది ఎంపీలు, రాయబారులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు ఆహ్వానాలు ఇచ్చినట్లు ప్రపంచ హిందూ ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు స్వామి విజ్ఞానానంద తెలిపారు. శ్రీరాముని వంశానికి చెందిన వారిగా చెప్పుకునే కొరియన్‌ రాణికి కూడా ఆహ్వానించినట్లు వెల్లడించారు.

Source link
previous post