Telangana

Warangal : మేడారానికి వెళ్లేందుకు వచ్చిన కుటుంబంలో తీవ్ర విషాదం



నీటి సంపులో తేలిన పిల్లలుబలేశ్వరి, రవి కుమార్ దంపతులు హైదరాబాద్ నుంచి వరంగల్ కు రాగా.. ప్రయాణంలో అలసిపోవడంతో ఇద్దరు తొందరగా నిద్రపోయారు. మిగతా కుటుంబ సభ్యులంతా ఎవరి పనుల్లో వాళ్లుండిపోయారు. కాగా అమ్మమ్మ వాళ్లింటికి వచ్చిన పిల్లలు శౌరితేజ, తేజస్వినీ సంతోషంగా ఆడుకుంటూ ఇంటి నుంచి బయటకు వెళ్లారు. అది ఎవరూ గమనించలేకపోయారు. ఈ క్రమంలోనే రాత్రి 11 గంటల ప్రాంతంలో పిల్లలు కనిపించడం లేదని గుర్తించిన కుటుంబ సభ్యులు వారి కోసం చుట్టుపక్కల వెతికారు. ఇంతలోనే తల్లి బలేశ్వరి, తండ్రి రవికుమార్ నిద్రలేపడంతో వారు కంగారు పడిపోయి పిల్లల కోసం వెతకసాగారు. చుట్టుపక్కల ఎంత వెతికినా ఫలితం లేకపోయింది. ఈ క్రమంలోనే ఇంటి ఆవరణలోని నీళ్ల సంపు వైపు వెళ్లగా.. చిన్నారి తేజస్వినీ మృతదేహం నీళ్లలో తేలుతూ కనిపించింది. శౌరితేజ నీటిలో మునిగి కనిపించడంతో వెంటనే కుటుంబ సభ్యులు బయటకు తీశారు. అప్పటికే బాలుడు కూడా ప్రాణాలు కూడా ప్రాణాలు కోల్పోయాడు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం ఇద్దరు చిన్నారుల మృతదేహాలను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి మార్చురీకి తరలించారు.



Source link

Related posts

Dasoju Sravan : విద్యార్థులకు కమ్మని బ్రేక్ ఫాస్ట్ పెడుతుంటే కాంగ్రెస్ నేతలకెందుకు కడుపుమంట – దాసోజ్ శ్రవణ్

Oknews

Gold rate at new record high level after us fed march meeting decisions | Gold: కొత్త రికార్డ్‌ సృష్టించిన బంగారం రేటు

Oknews

Sangareddy Police: కిడ్నాప్‌ అనుమానాలతో అమాయకులపై దాడులొద్దు.. సంగారెడ్డి ఎస్పీ వార్నింగ్…

Oknews

Leave a Comment