Telangana

Weather in Telangana Andhra pradesh Hyderabad on 9 April 2024 Summer heat waves updates latest news here | Weather Latest Update: ఈ జిల్లాలో నేడు తీవ్ర వడగాల్పులు, ఆరెంజ్ అలర్ట్ – ఈ ప్రాంతాల్లో ఈరోజు వర్షాలు



Weather Latest News: తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా సహా కొన్ని ప్రాంతాలలో వడగాల్పులు వీస్తున్నాయి. TSDPS కార్యాలయం అందించిన నివేదిక ప్రకారం భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, నల్గొండ, జోగులాంబ గద్వాల, జనగాం, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, మంచిర్యాల జిల్లాలలోని కొన్ని ప్రాంతాలలో వడగాల్పులు వీస్తున్నాయి.  ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో వడగాల్పుల విషయంలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.
రాగల మూడు రోజుల వరకు వాతావరణ విశ్లేషణ, హెచ్చరికలు
ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో క్రింది స్థాయి గాలులు దక్షిణ, ఆగ్నేయ దిశల నుండి వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ రోజు, రేపు, ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడ అక్కడ కురిసే అవకాశం వుంది. అలాగే తెలంగాణ రాష్ట్రంలో  కొన్ని జిల్లాలలో అక్కడ అక్కడ వడగాల్పులు కూడా వీచే అవకాశం ఉంది.  
ఈరోజు, రేపు, ఎల్లుండి రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం వుంది.
Hyderabad Weather: హైదరాబాద్ వాతావరణంహైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. నగరంలో తేలికపాటి చినుకులు కురిసే అవకాశం ఉంది. ఉదయం వేళల్లో పొగమంచు పరిస్థితులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 38 డిగ్రీలు, 26 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు గంటకు 6 నుంచి 10 కిలో మీటర్ల వేగంతో నైరుతి దిశగా ఉండే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 40.7 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 27.3 డిగ్రీలుగా నమోదైంది. 55 శాతంగా గాలిలో తేమ శాతం నమోదైంది.
ఏపీలోనూ వర్షాలుAndhra Pradesh Weather: నిన్నటి ఇంటీరియర్ ఒడిశా నుంచి ఉత్తర తమిళనాడు వరకు ఉన్న ద్రోణి ఇప్పుడు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ నుంచి దక్షిణ తమిళనాడు వరకూ అంతర్గత రాయలసీమ మీదుగా సగటు సముద్రమట్టానికి 0.9 కిలో మీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
ఈ ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, యానం ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములుతో కూడిన మెరుపులు, ఈదురుగాలులు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. వేడి తేమ, అసౌకర్యమైన వాతావరణం ఒకటి లేదా రెండు చోట్ల ఏర్పడే అవకాశం ఉంది. 
దక్షిణ కోస్తాంధ్రలో వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది. వేడి, తేమ, అసౌకర్యమైన వాతావరణం ఒకటి లేదా రెండు చోట్ల ఏర్పడే అవకాశం ఉంది. రాయలసీమలోనూ వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది. వేడి, తేమ, అసౌకర్యమైన వాతావరణం ఒకటి లేదా రెండు చోట్ల ఏర్పడే అవకాశం ఉంది.

మరిన్ని చూడండి



Source link

Related posts

Ramoji Film City : రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రమాదం

Oknews

తెలంగాణ స్టాఫ్ నర్స్ పరీక్ష తుది ఫలితాలు విడుదల, ఇలా చెక్ చేసుకోండి-hyderabad news in telugu staff nurse recruitment results released ,తెలంగాణ న్యూస్

Oknews

Ram Lalla Latest Photos: అయోధ్య గర్భగుడిలో కొలువై ఉన్న బాలరామయ్య ఫొటోలు చూశారా?

Oknews

Leave a Comment