Latest NewsTelangana

Weather in Telangana Andhrapradesh Hyderabad on 1 March 2024 Summer updates latest news here | Weather Latest Update: పెరుగుతున్న ఎండలు! తెలుగు రాష్ట్రాల్లో పొడి వాతావరణమే


Weather Latest News: ఈ రోజు క్రింది స్థాయిలోని గాలులు దక్షిణ, ఆగ్నేయ దిశ నుండి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఈ రోజు, రేపు, ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. 

Hyderabad Weather: హైదరాబాద్ వాతావరణం
హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. నగరంలో తేలికపాటి చినుకులు కురిసే అవకాశం ఉంది. ఉదయం వేళల్లో పొగమంచు పరిస్థితులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 35 డిగ్రీలు, 21 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు గంటకు 4 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో దక్షిణ, నైరుతి దిశగా ఉండే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 33.6 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 20.8 డిగ్రీలుగా నమోదైంది. 55 శాతంగా గాలిలో తేమ శాతం నమోదైంది.

Andhra Pradesh Weather: నిన్నటి దక్షిణ అంతర్గత కర్ణాటక నుంచి కొంకణ్ మీదుగా మధ్య మహారాష్ట్ర వరకూ ఉన్న ద్రోణి ఉత్తర కేరళ నుంచి కొంకణ్ వరకు సముద్ర మట్టానికి 0.9 కిలో మీటర్ల ఎత్తులో ఒక సముద్ర మట్టానికి 0.9 కిలో మీటర్ల ఎత్తులో ఒక ద్రోణి కొనసాగుతుందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్, యానంలో దిగువ ట్రోపో ఆవరణలో ఆగ్నేయ దిశలో గాలులు వీస్తున్నట్లు తెలిపారు.

ఈ ప్రభావంతో దక్షిణ కోస్తా ఆంధ్రలో వాతావరణం పొడిగానే ఉంటుందని అమరావతి వాతావరణ అధికారులు తెలిపారు. తేలికపాటి నుంచి ఓ మోస్తరు పొగమంచు ఉంటుందని చెప్పారు. ఉత్తర కోస్తాంధ్రలో కూడా వాతావరణం పొడిగా ఉండనుంది. రాయలసీమలో కూడా వాతావరణం పొడిగానే ఉంటుందని వాతావరణ అధికారులు వెల్లడించారు. పొగమంచు ఒకటి లేదా రెండు చోట్ల ఉండే అవకాశం ఉందని తెలిపారు. దక్షిణ కోస్తాలో కూడా పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.

మరిన్ని చూడండి



Source link

Related posts

Kumbam Anil Kumar Reddy : మళ్లీ కాంగ్రెస్ గూటికి కుంభం అనిల్ కుమార్ రెడ్డి, రసవత్తరంగా భువనగిరి పాలిటిక్స్!

Oknews

రాజ్ తరుణ్ కొత్త సినిమా విడుదల తేదీ వచ్చేసింది 

Oknews

Top Telugu News Today From Andhra Pradesh Telangana 02 March 2024 | Top Headlines Today: టీడీపీలోకి వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్

Oknews

Leave a Comment