Latest NewsTelangana

Weather In Telangana Andhrapradesh Hyderabad On 23 January 2024 Winter Updates Latest News Here | Weather Latest Update: కాస్త తగ్గిన చలి, తెలంగాణలో రేపు అక్కడక్కడ వర్షాలు పడే ఛాన్స్


Weather Latest News: నిన్నటి తూర్పు గాలులలోని ద్రోణి ఈరోజు దక్షిణ అంతర్గత కర్నాటక నుండి ఉత్తర అంతర్గత కర్నాటక, తెలంగాణ మరియు విదర్భ మీదుగా దక్షిణ ఛత్తీస్‌గఢ్ వద్ద ఉన్న ఉపరితల ఆవర్తనం వరకు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో కొనసాగుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ రోజు కింది స్థాయిలోని గాలులు నైరుతి, దక్షిణ దిశల నుంచి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయని అధికారులు తెలిపారు. దీని కారణంగా ఈ రోజు, రేపు తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి రాష్ట్రంలో తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు అక్కడ అక్కడ కురిసే అవకాశం ఉందని తెలిపారు.

Hyderabad Weather: హైదరాబాద్ వాతావరణం
హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘాలు పట్టి ఉంటుంది. ఉదయం వేళల్లో పొగమంచు పరిస్థితులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 32 డిగ్రీలు, 21 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు గంటకు 4 నుంచి 6 కిలో మీటర్ల వేగంతో ఆగ్నేయ దిశగా ఉండే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 31.7 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 20.7 డిగ్రీలుగా నమోదైంది. 81 శాతంగా గాలిలో తేమ శాతం నమోదైంది.

Andhra Pradesh Weather: ఈ ప్రభావంతో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి, ఆగ్నేయ దిశల్లో గాలులు వీయనున్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దక్షిణ కోస్తా ఆంధ్రలో వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. తేలికపాటి నుంచి ఓ మోస్తరు పొగమంచు ఉంటుందని చెప్పారు. ఉత్తర కోస్తాంధ్రలో రేపు వాతావరణం పొడిగా ఉండగా.. రాయలసీమలో కూడా వర్షాలేమీ పడే అవకాశం లేదని తెలిపారు. కానీ, పొగమంచు ఒకటి లేదా రెండు చోట్ల ఉండే అవకాశం ఉందని తెలిపారు. దక్షిణ కోస్తాలో కూడా పొగమంచు ఏర్పడే  అవకాశం ఉందని, తేలికపాటి నుంచి ఓ మోస్తరుగా ఉంటుందని అధికారులు అంచనా వేశారు.



Source link

Related posts

BRS BSP decided to contest the Lok Sabha elections together | BRS BSP Alliance : బీఆర్ఎస్, బీఎస్పీ మధ్య పొత్తు ఖరారు

Oknews

petrol diesel price today 18 March 2024 fuel price in hyderabad telangana andhra pradesh vijayawada | Petrol Diesel Price Today 18 Mar: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

Oknews

తప్పు సరిదిద్దుకున్న నాగార్జున..!

Oknews

Leave a Comment