Latest NewsTelangana

Weather in Telangana Andhrapradesh Hyderabad on 9 March 2024 Summer updates latest news here | Weather Latest Update: తెలంగాణ, రాయలసీమ మీదుగా ద్రోణి, నేటి వాతావరణం ఇలా


Weather Latest News: ఈ రోజు కింది స్థాయిలోని గాలులు తూర్పు/ ఆగ్నేయ దిశ నుంచి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఈ రోజు, రేపు, ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదు.

Hyderabad Weather: హైదరాబాద్ వాతావరణం
హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. నగరంలో తేలికపాటి చినుకులు కురిసే అవకాశం ఉంది. ఉదయం వేళల్లో పొగమంచు పరిస్థితులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 37 డిగ్రీలు, 23 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు గంటకు 4 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో తూర్పు, ఆగ్నేయ దిశగా ఉండే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 37.3 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 23.3 డిగ్రీలుగా నమోదైంది. 55 శాతంగా గాలిలో తేమ శాతం నమోదైంది.

Andhra Pradesh Weather: ద్రోణి తెలంగాణ నుంచి రాయలసీమ, తమిళనాడు మీదుగా కొమొరిన్ ప్రాంతం వరకు సముద్ర మట్టానికి 0.9 కిలో మీటర్ల ఎత్తులో ఉంది. ఉత్తర ఒడిశా నుంచి ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం వరకు సముద్ర మట్టానికి 0.9 కిలో మీటర్ల ఎత్తులో ఒక ద్రోణి వెళ్తుంది. సముద్ర మట్టానికి 0.9 కిలో మీటర్ల ఎత్తులో దక్షిణ ఒడిశా, పొరుగున ఉన్న తుపాను ప్రసరణ ఎగువ ద్రోణితో కలిసిపోయింది. సగటు సముద్ర మట్టానికి 1.5 కిలో మీటర్ల ఎత్తులో తెలంగాణ, పొరుగున ప్రాంతాలపై తుపాను సర్క్యులేషన్ ఉంది.

ఈ ప్రభావంతో దక్షిణ కోస్తా ఆంధ్రలో వాతావరణం పొడిగానే ఉంటుందని అమరావతి వాతావరణ అధికారులు తెలిపారు. తేలికపాటి నుంచి ఓ మోస్తరు పొగమంచు ఉంటుందని చెప్పారు. ఉత్తర కోస్తాంధ్రలో కూడా వాతావరణం పొడిగా ఉండనుంది. రాయలసీమలో కూడా వాతావరణం పొడిగానే ఉంటుందని వాతావరణ అధికారులు వెల్లడించారు. పొగమంచు ఒకటి లేదా రెండు చోట్ల ఉండే అవకాశం ఉందని తెలిపారు. దక్షిణ కోస్తాలో కూడా పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.

మరిన్ని చూడండి



Source link

Related posts

గజ్వేల్ లో గంజాయి ముఠా అరెస్ట్, ఏడుగురికి రిమాండ్-gajwel police arrested seven member gang selling ganja nearby areas ,తెలంగాణ న్యూస్

Oknews

Former CM KCR participates in BRS Public meeting in Nalgonda | KCR Speech: అసెంబ్లీలోనే జనరేటర్ పెడుతున్నరు, చేతగానోళ్ల పని ఇలాగే ఉంటది

Oknews

స్టెప్పమార్.. మణిశర్మ మాస్ జాతర!

Oknews

Leave a Comment