ByGanesh
Sat 15th Jun 2024 11:29 AM
పవన్ అభిమానులు అనుకున్నదంతా అయ్యేలా కనబడుతుంది వ్యవహారం. పవన్ ఎన్నికల్లో గెలిస్తే సినిమాలకి దూరమవుతాడని వాళ్ళు కంగారు పడ్డారు, ఆందోళన పడ్డారు. ఇప్పుడు అదే జరిగేలా ఉంది. పవన్ కళ్యాణ్ ని నమ్ముకుని సెట్స్ మీదకి సినిమాలని తీసుకొచ్చిన నిర్మాతలు ఇప్పుడేమిటా అని ఆలోచిస్తున్నారు.
డిప్యూటీ సీఎం గా మాత్రమే కాదు.. పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, అటవీ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు అంటూ పలు బాధ్యతలు నెత్తికెత్తుకున్నారు పవన్ కళ్యాణ్. మరి పవన్ కళ్యాణ్ ఆవేశం చూస్తుంటే ముందా శాఖలని ప్రక్షాళన చేసే వరకు నిద్రపోయేలా లేరు. చాలా కసి మీద కనిపిస్తున్నారు.
ఇప్పుడప్పుడే పవన్ కళ్యాణ్ ఫ్రీ అయ్యి మిగిలిన సినిమాల షూటింగ్స్ పూర్తి చేసేలా కనిపించడం లేదు. అప్పుడే OG వాయిదా అంటున్నారు. మరోపక్క వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ ఉన్నాయి. ఇవెప్పుడు పూర్తి చేస్తారో అని పవన్ ఫ్యాన్స్ తెగ వెయిట్ చేస్తున్నారు. అందుకే అనేది పవన్ ఎక్కడ-ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ అనేది..
Where is Pawan – fans are waiting here:
Pawan Kalyan is Andhra Dy CM, key portfolios