Latest NewsTelangana

wife sets fire to her husband for not buying earrings in khammam | Khammam News: దారుణం


Wife Sets Fire To Her Husband in Khammam: ఓ మహిళ తనకు చెవిదుద్దులు కొనివ్వలేదని భర్తకు నిప్పుపెట్టిన ఘటన ఖమ్మం (Khammam) జిల్లాలో సంచలనం కలిగించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా నిజాంపేటలో షేక్ యాకూబ్ పాషా, సమీనా దంపతులు నివాసం ఉంటున్నారు. వీరిద్దరూ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. తనకు చెవిదుద్దులు కావాలని సమీనా తన భర్తను అడిగింది. అయితే, అతను తన దగ్గర అంత డబ్బు లేదని తర్వాత కొనిస్తానని చెప్పాడు. ఈ విషయమై శనివారం సాయంత్రం ఇద్దరి మధ్య వివాదం తీవ్రమైంది. దీంతో ఆవేశానికి లోనైన సమీనా.. ఇంట్లో ఉన్న పెయింట్లకు సంబంధించిన రసాయనాన్ని భర్త పాషాపై పోసి నిప్పంటించింది. దీంతో పాషా గట్టిగా కేకలు వేస్తూ.. కాపాడాలని బయటకు పరుగులు తీశాడు. వెంటనే గమనించిన స్థానికులు మంటలు ఆర్పి ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో బాధితుడు తీవ్రంగా గాయపడగా.. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. పాషా తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని.. నిందితురాలు సమీనాను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు.

Also Read: Singer Mangli: ప్రముఖ గాయని మంగ్లీ కారును ఢీకొన్న డీసీఎం – మంగ్లీకి తప్పిన ప్రమాదం, ముగ్గురికి స్వల్ప గాయాలు

మరిన్ని చూడండి



Source link

Related posts

కేసీఆర్ వస్తున్నాడు- కాస్కో రేవంత్ రెడ్డి : కేటీఆర్

Oknews

Minister KTR on Governor Post : కాంగ్రెస్, బీజేపీ కేంద్రంలో కలిసికట్టుగా పనిచేసుకుంటారు | ABP Desam

Oknews

Pawan has to be defeated..! పవన్‌ ను ఢీ కొట్టలేక.. వైసీపీ పాచికలు!

Oknews

Leave a Comment