ByGanesh
Wed 20th Mar 2024 12:32 PM
పవన్ కళ్యాణ్ పొలిటికల్ కెరీర్ కి ఆయన ప్రజల కోసం చేసిన పోరాటం, ఆయన చేసిన మంచి పనులు ప్లస్ అవుతాయా? లేదంటే సినిమా లో పవర్ ఫుల్ డైలాగ్స్ చెబితే ఓట్లు రాలుతయా? అనేది ఇపుడు ఏపీ ప్రజల్లో మొదలుతున్న ప్రశ్న. జనసేన అధ్యక్షుడిగా అలుపెరగని పోరాటం చేస్తున్న పవన్ కళ్యాణ్ కి సీఎం కుర్చీ మీద ఆసక్తి లేదు, కానీ జగన్ ప్రభుత్వాన్ని పడెయ్యలే కసి ఉంది. కాబట్టే టీడీపీ, బీజేపీ తో పొత్తు పెట్టుకునేందుకు త్యాగాలు చేసారు. ఇక ఏపీ ప్రజల్లో పవన్ కళ్యాణ్ కి ఎంత గ్రిప్ ఉందో అనేది అర్ధం కానీ ప్రశ్న.
తన అభిమానులని నమ్ముకుని పవన్ కళ్యాణ్ రాజకీయాలు చేస్తే గత రెండుసార్లు ఎలక్షన్స్ లో ఏం జరిగిందో పవన్ చూసారు. అందుకే ఆయన అభిమానులని పవన్ నమ్మలేరు. కానీ ఎక్కడో ఏదో చిన్న ఆశ. అందుకే తన సినిమాలో తనకి ప్లస్ అవుతుంది అనుకుని ఓ టీజర్ కట్ చేయించారు. పొలిటికల్ డైలాగ్స్ పేర్చి, రాజకీయాలకు సరితూగేలా ఉస్తాద్ భగత్ సింగ్ లో హరీష్ శంకర్ చేత పవర్ ఫుల్ డైలాగ్స్ రాయించుకుని మరీ పవన్ తన నోటితో ఆ డైలాగ్స్ పలికారు.
గాజు పగిలేకొద్దీ పదునెక్కుద్ది, గ్లాస్ అంటే సైజు కాదు సైన్యం, కనిపించని సైన్యం అంటూ పవన్ కళ్యాణ్ చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్స్ ఈ ఎలక్షన్స్ కి పవన్ కి ప్లస్ అవుతాయా.. అని సాధారణ ప్రేక్షకులు అనుకుంటున్నారు. కానీ పవన్ ఫాన్స్ మాత్రం పూనకలొచ్చేసిన వాళ్ళలా ఊగిపోతున్నారు. అదే ఊపులో పవన్ కి ఓటేసి గెలిస్తే ఓకె.. లేదంటే మళ్ళీ పవన్ కి మోడీ చెయ్యి చూపిస్తే ఈసారి మాత్రం మాములుగా ఉండదు.
Will it be a plus for Pawan?:
Ustad Bhagat Singh teaser: Pawan Kalyan plays a righteous police officer