ఈ నెల 24న దిల్లీలో ధర్నా
కూటమి ప్రభుత్వం ఏర్పడి 50 రోజులు గడుస్తున్నా, చంద్రబాబు ఇన్ని భయాలతో పరిపాలన చేస్తున్నారని జగన్ అన్నారు. అచ్చం శిశుపాలుడి పాపాల మాదిరిగా, చంద్రబాబు పాపాలు కూడా పండే రోజు దగ్గర్లోనే ఉందన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనాయకులు దిల్లీకి వెళ్తున్నామన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలన, హత్యా రాజకీయాలు, దౌర్జన్యాలు, దోపిడీని.. 24వ తేదీన దిల్లీ ఫొటో గ్యాలరీ.. ప్రొటెస్ట్ ద్వారా దేశం దృష్టికి, వివిధ పార్టీ నాయకుల దృష్టికి తీసుకువెళ్తామన్నారు. ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టవలసిన అవసరాన్ని, పరిస్థితులను చెప్పబోతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మాతో కలిసి వచ్చే పార్టీలన్నింటినీ కలుపుకుని పోరాటం కొనసాగిస్తామని జగన్ ట్వీట్ చేశారు.