Andhra Pradesh

YS Sharmila : B అంటే బాబు, J అంటే జగన్, P అంటే పవన్


వైఎస్ షర్మిలా రెడ్డినే….

పులి కడుపున పులే పుడుతుందన్నారు వైఎస్ షర్మిల. తాను వైఎస్ఆర్ రక్తమని.. ఎవరు అవునన్నా కాదన్నా తాను YS షర్మిలా రెడ్డినే అని స్పష్టం చేశారు. “విమర్శ చేయడం నా ఉద్దేశ్యం కానే కాదు. వైఎస్ఆర్ పాలనకు జగన్ అన్న గారి పాలనకు చాలా వ్యత్యాసం ఉంది.YSR కి,జగన్ అన్నకు ఆకాశం,భూమికి ఉన్నంత తేడా ఉంది. YSR జలయజ్ఞంపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రాజెక్టులు జలమయం చేశారు. పోలవరం పనులు 32 శాతం పూర్తి చేశారు. ఆయన మరణం తర్వాత ప్రాజెక్ట్ పక్కన పడేసారు. ఆ తర్వాత చంద్రబాబు వచ్చినా,జగన్ అన్న గారు వచ్చినా ప్రాజెక్ట్ ముందుకు కదలలేదు. ఇక ప్రత్యేక హోదా పై బాబు,జగన్ అన్న మాట్లాడింది లేదు.బీజేపీతో దోస్తీ కోసం బాబు,జగన్ అన్న ఆంధ్ర రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టారు. హోదా గురించి రాగం తీసి ,నిరాహార దీక్షలు చేసిన వాళ్ళు ఇప్పుడు బీజేపీ కి బానిసలుగా మారారు. హోదా కాదు కదా… కనీసం ప్రత్యేక ప్యాకేజీ కూడా లేదు.రాష్ట్రం అభివృద్ది చెందాలి అంటే వీళ్ళతో కాదు .. రాష్ట్రంలో ,కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే రాష్ట్రం బాగుపడుతుంది”అని వైఎస్ షర్మిల పునరుద్ఘాటించారు.



Source link

Related posts

AP TET Exams: వారికి ఫీజు రిఫండ్‌…. ప్రశాంతంగా టెట్ పరీక్ష… తొలి రోజు 87శాతం హాజరు

Oknews

AP TET Hall Ticket 2024 : ఏపీ టెట్ హాల్ టికెట్లు విడుదల

Oknews

Pawan Kalyan: వైసీపీ నాయకులు ప్రత్యర్థులు మాత్రమే.. మహిళల్ని కించపరిస్తే వేటు పడుతుందని పవన్ వార్నింగ్

Oknews

Leave a Comment