సోషల్ మీడియాలో వివాదాలకు పెట్టింది పేరు విశ్వక్ సేన్. అతడు కావాలని పెట్టకపోయినా, ఎన్నో పోస్టులు వివాదాలకు దారితీశాయి. అందుకే అతడు ఇనస్టాగ్రామ్ నుంచి తప్పుకున్నాడని చాలామంది అనుకున్నారు.
విశ్వక్ కూడా తను ఎందుకు సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా ఉండడం లేదో వివరణ ఇచ్చే ప్రయత్నం చేయలేదు. ఓ హీరోయిన్ కారణంగా విశ్వక్, సోషల్ మీడియాకు దూరమయ్యాడనే పుకారు కూడా ఉంది. ఈ మొత్తం వ్యవహారంపై విశ్వక్ స్పందించాడు.
“త్వరలోనే 30 ఏళ్లు వస్తున్నాయి. ఇంకా ఫోన్ లో గంటలు గంటలు కూర్చోవడం ఏంటనే ఆలోచన వచ్చింది. వయసొచ్చింది కదా, కాస్త ఫోన్ పక్కనపెట్టి ఎక్కువ పని చేద్దామనిపించింది. అందుకే ఇనస్టాగ్రామ్ డీ-యాక్టివేట్ చేశా. ఇకపై నా సినిమా రిలీజ్ కు వారం ముందు ఇనస్టాగ్రామ్ లోకి వస్తా. సినిమా రిలీజైన వారం తర్వాత మళ్లీ వెళ్లిపోతా.”
మెకానిక్ రాకీ గ్లింప్స్ రిలీజ్ చేశాడు విశ్వక్. గ్లింప్స్ చూస్తుంటే, రొటీన్ కమర్షియల్ ఎంటర్ టైనర్ లా ఉందనే కామెంట్ పై స్పందించాడు. రొటీన్ గా ఉన్న సినిమాలు తను ఒప్పుకోనని, ఓ సామాన్య ప్రేక్షకుడిగా తను ఎలాంటి సినిమాలు చూడాలనుకున్నానో, అలాంటివే చేశానని, మెకానిక్ రాకీ కూడా అలాంటి మూవీనే అంటున్నాడు.