Health Care

అక్కడ నొక్కితే ఎందుకు హాయిగా ఉంటుంది.. SP6 పాయింట్ అంటే ఏమిటి?


దిశ, ఫీచర్స్ : మీరు తీవ్రమైన ఒత్తిడిలో ఉంటారు. తలనొప్పిగా అనిపిస్తుంది. ఆ క్షణంలో మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఉంటే ఏం చేస్తారు? . జండు బామ్ రాయడమో, తలపై, నుదుటిపై, అరచేతులపై, కాలి మడమకు పైభాగంలో మృదువుగా నొక్కడమో చేస్తారు. కొద్ది క్షణాల్లో రిలాక్స్ అయి పోతుంది. చక్కగా నిద్రపడుతుంది. అద్భుతం కదా!.. ఏ మెడిసిన్ వేసుకోకుండానే మీలోని స్ట్రెస్, తలనొప్పి ఎలా పారిపోయింది? ఇదే ఆక్యుప్రెషర్ థెరపీకి చక్కటి ఉదాహరణ అంటున్నారు కొందరు నిపుణులు.

ఆనందాన్ని కలిగిస్తుంది

ఆక్యుప్రెషర్ థెరపీకి సంపూర్ణ మద్దతు ఇచ్చే శాస్త్రీయ ఆధారాలైతే పెద్దగా ఉండవు కానీ, కొన్ని సందర్భాల్లో అది ఓ టానిక్‌లా పనిచేస్తుందని, మానసిక ఆనందాన్ని కలిగిస్తుందని పలువురు చెప్తుంటారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో దీని గురించి కొందరు డిస్కస్ చేస్తున్నారు. డీ హైడ్రేషన్, స్టమక్ ఇష్యూస్, నిద్రలేమి వంటి రోజువారీ ఆందోళనలను పరిష్కరించేందుకు కొన్ని ప్రత్యేకమైన పరిష్కారాలను కూడా ఈరోజుల్లో సోషల్ మీడియా సూచిస్తోంది. అంటే అందులో నిపుణులు కనెక్ట్ అయి ఉండటంవల్ల పలు సలహాలు ఇస్తుంటారు. ప్రస్తుతం ఒత్తిడి నుంచి ఉపశమనానికి, నిద్రలేమి సమస్యకు పరిష్కారంగా దీనిని ఎస్పీ6 పాయింట్‌ను సూచిస్తున్నారు.

నిద్రలేమికి చెక్

ఇటీవల నిద్రలేమితో బాధపడేవారికి పలువురు ఆక్యుప్రెషర్ నిపుణులు, అనుభవజ్ఞులు అరికాలిపై లేదా చీలమండలం భాగంలో ఒక నిర్ధిష్ట ప్రదేశంలో నొక్కడంవల్ల చక్కటి పరిష్కారం లభిస్తుందని చెప్తున్నారు. దీనిని SP6 పాయింట్ అని పిలుస్తున్నారు. చీలమండలంపై నాలుగు వేళ్ల వెడల్పు గల కాలి ఎముక వెనుక ఇది ఉంటుంది. దీనిని నొక్కడంవల్ల త్వరగా నిద్రపట్టడం, అలాగే మహిళలు అయితే మెన్‌స్ట్రువల్ ఇరిటేషన్ వంటి సమస్యల నుంచి వేగంగా రిలాక్స్ పొందుతారు.

అలసటను దూరం చేస్తుంది

తల నిమరడం, తలపై వెంట్రుకలు సున్నితంగా లాగడం, అరికాళ్లను స్పృశించడం వంటివి కూడా ఒత్తిడి నుంచి విముక్తి కలిగిస్తుంటాయి. నిద్రలేమి సమస్యకు పరిష్కారంగా ఉంటాయి. ఇవన్నీ ఆక్యుప్రెషర్ థెరపీలోను చిన్న భాగాలేనని నిపుణులు చెప్తున్నారు. నిర్దిష్ట పాయింట్‌లో నొక్కడం లేదా మర్దన చేయడం శారీరక, మానసిక అలసటను దూరం చేస్తుందని, చక్కగా నిద్రపట్టడంలో, శరీరంలోని అన్ని భాగాలకు రక్త ప్రసరణ జరగడంలో సహాయపడుతుందని కొందరు అనుభవజ్ఞులు కూడా చెప్తుంటారు.



Source link

Related posts

పాజిటివ్ థింకింగ్..అంతా మన మంచికే.. | Tips to increase positive thinking

Oknews

సోషల్ మీడియా సానుకూల ధోరణులు.. ఎకౌంట్ లేకుంటే నష్టపోయినట్టే !

Oknews

టొమాటోలు ఎక్కువగా ఎవరు తినకూడదు.. కారణం ఏంటో తెలుసా..

Oknews

Leave a Comment