Top Stories

అడవి శేష్ మీద 150 కోట్లు


స్లో అండ్ సైలంట్ గా సినిమాలు చేస్తూ, సక్సెస్ బాటలో వెళ్తున్న వాళ్లు తక్కువగా వుంటారు. హీరో అడవి శేష్ ఆ కోవలోకి వస్తాడు. ఎక్కడ వున్నారో, ఏం చేస్తున్నారో తెలియదు. సినిమా విడుదల ముందు వరకు అంతా సైలంట్ గా వుంటుంది వ్యవహారం. వున్నట్లుండి సినిమా ప్రచారం మొదలవుతుంది. అది కూడా మామూలుగా వుండదు.. అదే పనిగా సాగుతుంది. సినిమా విడుదలై హిట్ కొడుతుంది. మళ్లీ అడవి శేష్ సైలంట్ అయిపోతారు. ఇదే టైమ్ టేబుల్. అందుకే నిర్మాతలు ఎంత ఆలస్యమైనా టెన్షన్ పడరు. అంతా అడవి శేష్ కే వదిలేస్తారు.

ఇప్పుడు అడవి శేష్ సమాంతరంగా రెండు సినిమాలు చేస్తున్నారు. గూఢచారి 2, డెకాయిట్. రెండింటినీ అనౌన్స్ చేసేసారు. ఎలా వుండబొతున్నాయో జస్ట్ గ్లింప్స్ లు వదిలి, తన పని తాను మొదలెట్టేసారు. రెండూ పాన్ ఇండియా సినిమాలే. అడవిశేష్ కు ఇప్పటికే మేజర్ సినిమాతో నార్త్ లొ మంచి మార్కెట్ వచ్చింది. బహుశా అందుకే కావచ్చు. ఈ రెండు సినిమాలను పాన్ ఇండియా సినిమాలుగా తీస్తున్నారు. రెండింటి బడ్జెట్ దాదాపు 150 కోట్లు.

అడవి శేష్ మీద ఇంత బెట్ అంటే కాస్త ఆశ్చర్యమే. కానీ నిర్మాతలకు అతని మీద వున్న నమ్మకం కావచ్చు. నాన్ థియేటర్ మీద కనుక రెండు సినిమాలు కలిసి 100 కోట్లు రాబట్టగలిగితే, పెద్దగా ఇబ్బంది వుండదు. ఈ రెండు సినిమాల్లో స్టార్ కాస్ట్ కూడా బలంగా వుంది.

ఒక సినిమాను అన్నపూర్ణ బ్యానర్, ఆసియన్ సునీల్ కలిసి నిర్మిస్తుంటే, మరో సినిమాను అభిషేక్ అగర్వాల్, పీపుల్స్ మీడియా కలిసి నిర్మిస్తున్నారు. ఈ రెండు సినిమాలు ఈ ఏడాది చివరిలో ఒకటి, వచ్చే ఏడాది ఆరంభంలో మరొకటి విడదలయ్యే అవకాశం వుంది.



Source link

Related posts

చంద్రబాబు అరెస్ట్.. సీనియర్ నటుడు నో కామెంట్

Oknews

అతిపెద్ద విలీనం ఆగిపోయింది

Oknews

నేనూ శబ్దం చేస్తా… చంద్రబాబుకు మద్దతుగా!

Oknews

Leave a Comment