Health Care

అణుబాంబు, వైరస్ కాదు ఈ కారణంగానే మానవ జాతి అంతం.. శాస్త్రవేత్త హెచ్చరిక


దిశ, ఫీచర్స్: మానవ జాతి అంతం గురించి శాస్త్రవేత్తల నుంచి సామాన్యుల వరకు ఇంట్రెస్టింగ్ గా చర్చిస్తారు. కొందరు అణు బాంబుల వల్ల మనుషులు భూమి మీద లేకుండా పోతారని చెప్తే.. ఇంకొందరు కరోనా వైరస్ లాంటి మహమ్మారి ఇందుకు కారణమని చెప్తారు. కానీ ఈ రెండు కాదు. ఫంగస్ వల్లనే మానవ జాతి తుడిచిపెట్టుకుపోతుందని అంటున్నాడు అమెరికాకు చెందిన శాస్త్రవేత్త. ‘ ది లాస్ట్ ఆఫ్ అజ్ ‘ టెలివిజన్ సిరీస్ లో చూపించినట్లుగా శిలీంధ్రాల వ్యాప్తి నాగరికతను నాశనం చేస్తుందని హెచ్చరించాడు.

మాలిక్యులర్ మైక్రోబయాలజీ, ఇమ్యునాలజీ మరియు ఇన్ఫెక్షియస్ డిసీజెస్ ప్రొఫెసర్ ఆర్టురో కాసాడెవాల్ ప్రకారం.. ఫంగస్ కాటుతో మనుషులు రాక్షసులుగా మారుతారు. ఈ జాంబీలు ఇతరులను తినేస్తాయి. తద్వారా మానవ జాతి అంతం అయిపోతుంది. కాబట్టి మానవాళికి నిజమైన ముప్పు ఫంగస్ కానుంది. కాగా ప్రొఫెసర్ కాసాడెవాల్ ‘ వాట్ ఇఫ్ ఫంగీ విన్?’ బుక్ రీసెంట్ గా రిలీజ్ అయింది. ఫంగల్ కారణంగా వచ్చిన మహమ్మారి గురించి వివరించడం అందరి దృష్టిని ఆకర్షించింది. ‘ఇప్పటి వరకు ప్రజలను జాంబీస్‌గా మార్చగల సామర్థ్యాన్ని కలిగి ఉన్న శిలీంధ్రాలు ఏవీ లేవు. అయితే, కాలక్రమేణా ప్రాణాంతకమైన ఫంగల్ ఇన్ఫెక్షన్లు బయటపడతాయని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఇది జరగడాన్ని మేము ఇప్పటికే చూశాము’ అని తెలిపాడు.



Source link

Related posts

జనవరి 25నే జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారు ?

Oknews

పాజిటివ్ ఎనర్జీకి కావాలా?.. వీటిపై ఫోకస్ చేయండి !

Oknews

ఆత్మహత్యలను ప్రేరేపిస్తున్న ఓసీడీ.. సర్వేలో షాకింగ్ విషయాలు వెళ్లడి!

Oknews

Leave a Comment