Entertainment

అనాథ పిల్లల కోసం ‘గుంటూరు కారం’ స్పెషల్ షో.. గొప్ప మనసు చాటుకున్న సితార


సూపర్ స్టార్ మహేష్ బాబు కుమార్తె సితార ఘట్టమనేని తన మంచి మనసుని చాటుకుంది. చీర్స్ ఫౌండేషన్‌లోని అనాథ పిల్లల కోసం, సంక్రాంతి కానుకగా విడుదలైన తన తండ్రి తాజా చిత్రం ‘గుంటూరు కారం’ ప్రత్యేక ప్రదర్శనను నిర్వహించింది. మహేష్ బాబు ఫౌండేషన్ సహకారంతో ఏఎంబీ సినిమాస్‌లో ఈ కార్యక్రమం జరిగింది.

చీర్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలోని పసి హృదయాలకు సినిమాటిక్ ట్రీట్‌ను అందిస్తూ ఏఎంబీ సినిమాస్‌లో అద్భుత సాయంత్రం ఆవిష్కృతమైంది. పిల్లలతో పాటు, వారి సంరక్షకులు కూడా “గుంటూరు కారం” యొక్క ప్రత్యేక స్క్రీనింగ్‌కు హాజరయ్యారు. సితార ఈ వేడుకను అద్భుతంగా హోస్ట్‌ చేసింది. పిల్లల ఆనందం మరియు ఉత్సాహం వేడుకకు అదనపు ఆకర్షణగా నిలిచాయి. చిన్నారుల ముఖాల్లో చిరునవ్వులు నింపే అవకాశం రావడం పట్ల మహేష్ బాబు హర్షం వ్యక్తం చేశారు.

మహేష్ బాబు ఫౌండేషన్ వివిధ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటుంది. ముఖ్యంగా ఎందరో చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయించింది. ఇక ఇప్పుడు అనాథ పిల్లల ఆనందం కోసం స్పెషల్ స్క్రీనింగ్ నిర్వహించడంపై ప్రశంసలు కురుస్తున్నాయి.



Source link

Related posts

దిల్ రాజు ఇంట విషాదం

Oknews

తెలుగు రాష్ట్రాల్లో దేవర బిజినెస్.. కల్కిని క్రాస్ చేస్తుందా 

Oknews

కన్నకొడుకు చేతిలో ప్రముఖ సినిమా నటి హత్య 

Oknews

Leave a Comment