EntertainmentLatest News

‘అనుకున్నవన్ని జరగవు కొన్ని’ పోస్టర్‌ లాంచ్


శ్రీరామ్‌ నిమ్మల, కలపాల మౌనిక జంటగా నటిస్తున్న చిత్రం ‘అనుకున్నవన్ని జరగవు కొన్ని’  . శ్రీ భారత ఆర్ట్స్‌ సంస్థ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి జి.సందీప్‌ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం పోస్టర్‌ను అల్లరి నరేష్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘అనుకున్నవన్ని జరగవు కొన్ని’ టైటిల్‌ లాంచ్  చేయడం ఆనందంగా ఉంది. పోస్టర్‌ ఆసక్తికరంగా ఉంది. దర్శకుడు నేను నటించిన ‘సిల్లీ ఫెలోస్‌’ చిత్రానికి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేశాడు. ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం కావడం ఆనందంగా ఉంది. ఈ సినిమా విజయవంతమై టీమ్‌ అందరికీ మంచి పేరు రావాలి. దర్శకుడిగా సందీప్‌ బిజీ కావాలి’’ అని అన్నారు.

హీరో శ్రీరామ్‌ నిమ్మల మాట్లాడుతూ ”క్రైమ్‌ కామెడీ థ్రిల్లర్‌ ఇది. నరేష్‌గారు క్రైమ్‌, కామెడీ జానర్‌ చిత్రాలెన్నో చేశారు. ఈ టైటిల్‌ లాంచ్  చేయడానికి ఆయనే కరెక్ట్‌ అనిపించింది. సినిమా అవుట్‌పుట్‌ బాగా వచ్చింది. నవంబర్‌ 3న సినిమాను విడుదల చేస్తున్నాం’’ అని తెలిపారు.

దర్శకుడు సందీప్‌ మాట్లాడుతూ ”దర్శకుడిగా తొలి చిత్రమిది. క్రైమ్‌ కామెడీ నేపథ్యంలో తెరకెక్కించాం. ఆరిస్ట్‌లు అంతా అద్భుతంగా యాక్ట్‌ చేశారు. అందరికీ ఈ చిత్రం నచ్చుతుంది. కామెడీని బాగా ఎంజాయ్‌ చేస్తారు. నవంబర్‌ 3న విడుదల కానున్న మా చిత్రాన్ని తప్పకుండా థియేటర్స్‌లో చూడండి. మా సినిమా పోస్టర్‌ విడుదల చేసిన నరేష్‌గారికి థ్యాంక్స్‌’’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న హీరోయిన్  మౌనిక సినిమాలో అవకాశం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ, సినిమా సక్సెస్‌ కావాలని ఆకాంక్షించారు.

 



Source link

Related posts

‘ఆంటోనీ’ మూవీ రివ్యూ

Oknews

మంగళవారం సినిమా శుక్రవారం రిలీజ్‌ అవుతుందట!!

Oknews

Mrunal Thakur in Black Dress Photos Creates Sensation మతిపోగొడుతోన్న మృణాల్ అందాలు

Oknews

Leave a Comment