EntertainmentLatest News

అనుష్క ఎక్కడ.. ఆమెకి ఏమైంది? 


ఒకప్పుడు తెలుగు తెర మీద హీరోలతో పాటు హీరోయిన్లు కూడా తమ ఆధిపత్యాన్ని కొనసాగించేవారు. కానీ క్రమ క్రమంగా ఆ ఆధిపత్యం కనుమరుగైపోతుందనుకుంటున్న టైం లో లైం లైట్ లో కి వచ్చిన నటి అనుష్క శెట్టి (anushka shetty) మంగుళూరు కి చెందిన ఈ ముద్దుగుమ్మ తన అధ్బుతమైన నటనతో  తక్కువ వ్యవధిలోనే హీరోతో సమానంగా క్రేజ్  తెచ్చుకొని టాప్ హీరోయిన్ గా నిలబడింది. మరి ఇలాంటి అనుష్క దగ్గర నుంచి ఎలాంటి కొత్త సినిమా అప్ డేట్ రావడం లేదని ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు.


అనుష్క హీరోయిన్ గా గత సంవత్సరం సెప్టెంబర్  7 న మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే మూవీ  వచ్చింది. ప్రేక్షకులని ఆ మూవీ ఒక మాదిరిగానే ఆకట్టుకుంది. ఆ తర్వాత అనుష్క నటించబోయే కొత్త తెలుగు మూవీ గురించి ఇంతవరకు ఎలాంటి అప్ డేట్ లేదు.కనీసం  సినిమా పత్రికల్లో ఆమెకి సంబంధించిన వార్తలు కూడా ఎక్కడ దర్శనం ఇవ్వడం లేదు.కారణాలు ఏమైనా గాని అసలు బాహుబలి సిరీస్ తర్వాత అనుష్క నుంచి చాలా తక్కువ సినిమాలే వచ్చాయి. ఆమె ప్రస్తుతం మలయాళంలో  కథనార్ ది వైల్డ్ సోర్సరర్ అనే ఫాంటసీ థ్రిల్లర్ లో  నటిస్తుంది. ఈ మూవీ ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ దశలోనే ఉంది.

ఇప్పటి వరకు తెలుగు తమిళ భాషల్లో కలిపి సుమారు 50  సినిమాలకి పైగానే నటించిన అనుష్క  అరుంధతి  చిత్రంతో   ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారడమే కాకుండా తెలుగు ప్రేక్షకుల అభిమాన కథానాయికగా కూడా మారింది. జేజమ్మ గా ఆమె ప్రదర్శించిన నటనకి చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఆమె అభిమానిగా మారిపోయారనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.ఇక అక్కడనుంచి  అనుష్క సిల్వర్ స్క్రీన్ మీద కనిపిస్తే చాలు ఆ మూవీకి కాసుల వర్షం కురవడం స్టార్ట్ అయ్యింది.ఇక  బాహుబలి(baahubali)లో దేవసేన గా  విజృంభించి  తెలుగు సినిమా సింహాసనాన్ని కూడా  అధిష్టించింది.అలాంటి అనుష్క కి తెలుగు సినిమాలు రావడంలేదా లేక ఆమెనే ఒప్పుకోవడంలేదా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఏది ఏమైనా అనుష్క  మరిన్ని తెలుగు సినిమాల్లో నటించాలని ఆమె అభిమానులు మాత్రం  కోరుకుంటున్నారు.

 



Source link

Related posts

ఇళయరాజా కుమార్తె భవతారిణి కన్నుమూత!

Oknews

మీ సోదరితో బ్లూ ఫిల్మ్ తీస్తావా, బుతులతో రెచ్చిపోయిన హీరోయిన్!

Oknews

డబుల్ ఇస్మార్ట్ ఫ్లాష్ బ్యాక్ పై క్రేజీ న్యూస్

Oknews

Leave a Comment