ఉన్నత చదువుల కోసం వెళ్లి
గుంటూరు బుర్రిపాలెంకు చెందిన పరుచూరి అభిజిత్(20) యూఎస్ఏ(Telugu Student Murdered in USA)లోని బోస్టన్ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ చదువుతున్నాడు. పరుచూరి చక్రధర్, శ్రీలక్ష్మి దంపతులకు అభిజిత్ ఏకైక కుమారుడు. అభిజిత్ తెలివైన విద్యార్థి అని కుటుంబ సభ్యులు తెలిపారు. విదేశాల్లో చదువుకోవాలనే అభిజిత్ (Paruchuri Abhijit)నిర్ణయాన్ని అతని తల్లి మొదట్లో వ్యతిరేకించినప్పటికీ, భవిష్యత్తు బాగుంటుందని తన మనసు మార్చుకుని విదేశాలకు పంపడానికి ఒప్పుకుంది. ఉన్నత చదువు కోసం అమెరికా వెళ్లిన కొడుకు హత్యకు గురయ్యాడని తెలియగానే అభిజిత్ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అభిజిత్ భౌతికకాయం శుక్రవారం సాయంత్రం గుంటూరులోని బుర్రిపాలెంలోని ఆయన ఇంటికి తరలించారు. ఇటీవలె భారతీయ సంతతికి చెందిన ఓ వ్యక్తిపై అమెరికాలో దాడి జరిగింది. రక్తపు మడుగులో సాయం కోసం అతడు చేసిన వీడియో వైరల్ అయ్యింది. ఈ ఏడాది భారతీయులపై దాడి జరగడం ఇది తొమ్మిదోసారి.