దిశ, ఫీచర్స్ : అమ్మతనం గొప్ప అద్భుతం. అమ్మకావాలని ప్రతీ మహిళా కోరకుంటుంది. అయితే ప్రసవానంతరం ప్రతీ తల్లీ ఓ భయంకరమైన అనుభవం ఎదుర్కొంటుంది.మానసికంగా, శారీరకంగా ఎన్నో సమస్యలు ఎదర్కోకక తప్పదు. ఓ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఆమె శరీరం చాలా బలహీనంగా మారుతుంది. దాని నుంచి కోలుకోవడానికి ఆ తల్లికి చాలా సమయం పడుతుది.అయితే దీనిపై నోయిడాలోని ఫోర్టిస్ హాస్పిటల్ ప్రసూతి, గైనకాలజీ డైరెక్టర్ & హెచ్‌ఓడి డాక్టర్ అంజనా సింగ్ మీడియాతో మాట్లాడుతూ, బాలింతలు ఆరోగ్యంగా ఉండటానికి ఏం చేయాలో,ఎలా డైట్ మెంటైన్ చేయాలి అనేవిషయాన్ని తెలియజేశారు.
అంజనా సింగ్ మాట్లాడుతూ.. డెలివరీ తర్వాత, అది సీ సెక్షన్ అయినా, నార్మల్ డెలవరీ అయినా ప్రతీ తల్లి తాను కోలుకోవడం, తల్లిపాల ఉత్పత్తిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలంట.తల్లి తీసుకునే పోషకాహారమే బిడ్డకు ఉపయోగపడుతుంది. అందువలన ప్రసవం తర్వాత ప్రతీ తల్లి ప్రొటిన్స్, తక్కువ కొవ్వు, కాల్షియం, పాల ఉత్పత్తిని పెంచే, పండ్లు, కూరగాయలు తీసుకోవాలంట.అధిక ఫైబర్ కార్బోహైడ్రేట్లు, గెలాక్టాగోగ్‌లు (తల్లి పాలను మెరుగుపరిచే ఏజెంట్లు) సమృద్ధిగా ఉండే అదనపు 500 కేలరీలతో కూడిన సమతుల్య ఆహారం, రోజుకు 1800 నుండి 2200 కిలో కేలరీలు తీసుకోవాలంట.
అయితే కొంత మంది తల్లులు ప్రసవానంతర బరువును తగ్గించుకోవడానికి కార్బోహైడ్రేట్‌లను తీసుకోవడానికి ఇష్టపడరు. ఇది సరైనది కాదు, కొత్తగా తల్లైన వారికి కార్బోహైడ్రేట్స్ చాలా అవసరం, ఇది పాల ఉత్పత్తిన పెంచడమే కాకుండా, మానసిక ఆరోగ్య, హర్మోన్ నియంత్రనుకు ఉపయోగపడుతుందని తెలిపారు. ఇక ఈ కాలంలో, మహిళలు తరచుగా డీహైడ్రేషన్‌తో బాధపడుతున్నారు.ఆ సమస్య నుంచి బయటపడటానికి ఎక్కువగా వాటర్ కంటెంట్ ఉన్నవి తీసుకోవాలంట. కొబ్బరినీరు, హెర్బల్ టీ, జ్యూస్‌లు ,రోజూ కనీసం 4 గ్లాస్‌ల పాలు లాంటివితీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిదని వైద్యులు చెబుతున్నారు.
ప్రసవానంతరం ఆల్కహాల్, కెఫిన్‌కు దూరంగా ఉండాలని డాక్టర్ సింగ్ సలహా ఇవ్వగా, డాక్టర్ రోలి బాంథియా బాలింతలు తీసుకోవాల్సిన ముఖ్యమైన ఆహారలను తెలియజేశారు అవి :
*లీన్ ప్రోటీన్లు: ఎముకలు ధృడంగా ఉండటానికి, కణాలు మళ్లీ ఎప్పటిలా బలంగా మారడానికి పౌల్ట్రీ, చేపలు, లీన్ మాంసాలు, గుడ్లు ,చిక్కుళ్ల వంటివి తీసుకోవాలంట.
*పండ్లు, కూరగాయలు: అవసరమైన విటమిన్లు, ఖనిజాలతో సమృద్ధిగా ఉన్న పండ్లు, కూరగాయలు తీసుకుంటే అవి జీవక్రియను మెరుగు పరచడానికి తోడ్పడుతాయి.
*తృణధాన్యాలు: శక్తి స్థాయిలను పెంచడానికి , ప్రేగు క్రమబద్ధతకు సహాయపడటానికి బ్రౌన్ రైస్, క్వినోవా మరియు ఓట్స్ వంటి తృణధాన్యాలను తీసుకోవాలంట.
*ఆరోగ్యకరమైన కొవ్వులు: మెదడు ఆరోగ్యం, హార్మోన్ ఉత్పత్తికి తోడ్పడేందుకు అవకాడోలు, గింజలు మరియు ఆలివ్ నూనె వంటి వాటిని మీ డైట్ చార్ట్‌లో చేర్చుకోవాలంట.