Health Care

అమ్మాయిల్లో అటెన్షన్ సీకింగ్ అనర్థమా.. కొందరు ఎందుకని అర్థం చేసుకోలేకపోతారు?


దిశ, ఫీచర్స్ : అటెన్షన్ సీకింగ్(Attention seeking) బిహేవియర్ లేదా మెంటాలిటీ గురించి మీరు చాలా తక్కువగా విని ఉంటారు. గుర్తింపు పొందాలని లేదా చేస్తున్న వర్క్ ఏదైనా సరే మంచి నైపుణ్యం ప్రదర్శించాలని, ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు తాను బెస్ట్‌గా అనిపించాలని పడే ఆరాటంవల్ల ఒక వ్యక్తిలో కనిపించే మానసిక, శారీరక లక్షణాలను నిపుణులు ఇలా పిలుస్తున్నారు. వాస్తవానికి ఇది మంచిదే. చదువులో, వర్క్ ప్లేస్‌లలో మంచి గుర్తింపు పొందాలన్న ఆరాటం అక్కడి పరిస్థితులు సహకరిస్తే వారు మరింత ఉన్నత స్థితికి ఎదిగేందుకు దోహదపడుతుంది. కానీ ఇది అందరి విషయంలో ఒకేలా వర్తించడం లేదు. దీనివల్ల చాలా వరకు అబ్బాయిలకు మంచి గుర్తింపు వస్తుండగా, అమ్మాయిలు అవమానాలను ఎదుర్కొంటున్న సందర్భాలే అధికంగా ఉంటున్నాయి. అందుకు కారణం ఎదుటి వ్యక్తులు, సన్నిహితులు లేదా కొలీగ్స్ అమ్మాయిలను అర్థంచేసుకోవడంలో జరుగుతున్న పొరపాట్లు, అవగాహనా రాహిత్యమేనని నిపుణులు చెప్తున్నారు.

వేరే ద్దేశాలు ఉండవ్..

సమస్యలు, సవాళ్లతోపాటు పర్సనల్ బౌండరీస్, ఏదో సాధించాలి, మంచి గుర్తింపు పొందాలనే ఆరాటం కూడా కొన్నిసార్లు అమ్మాయిల్లో ఇతరులతో కొంచెం అతి చొరవకు దారితీయవచ్చు. ఇది ఎదుటి వ్యక్తులు అబ్బాయిలు లేదా పురుషులు అయిప్పుడు వారికి అమ్మాయిలది ‘భిన్నమైన ప్రవర్తన’గా అనిపించవచ్చు కానీ అమ్మాయిల మనసులో ఏ ఉద్దేశాలూ ఉండవు. వారు ఒత్తిళ్ల మధ్య నిరాశ, నిస్పృహలో కూరుకుపోయి ఉండవచ్చు. ఏమీ తోచక తనకు ఏదో జరుగుందనే అనుమానంతోనో, ఎదుటి వ్యక్తులు ఫ్రెండ్స్ లేదా సన్నిహితులే కాబట్టి తనకు ప్రాబ్లం ఉండకపోవచ్చుననే ఉద్దేశంతోనో తమ మనసులోని మాటను చెప్పేస్తుంటారు. ఇలాంటి పరిస్థితిలో ఎదుటి వ్యక్తి అవసరమైతే హెల్ప్ చేయగలగాలి. ఫ్యామిలీ మెంబర్స్ అయితే మరింత కేర్ తీసుకోవాలి. కానీ మన చుట్టూ ఉన్న సమాజంలో, వర్క్ ప్లేస్‌లలో, పని ప్రదేశాల్లో ఇందుకు భిన్నంగా బాధితులైన అమ్మాయిలనే బాధితులుగా ముద్రవేసే వారు ఎక్కువగా ఉంటున్నారు.

ఎక్స్‌ట్రాలు.. డ్రామాలు!

ముఖ్యంగా అమ్మాయిల్లో గుర్తింపు పొందాలనే ఆరాటం(అటెన్షన్ సీకింగ్)తో కూడిన బిహేవియర్ కనిపించగానే పురుషాధిక్య భావజాలం కలిగిన స్త్రీలు కూడా సాటి అమ్మాయిలను అర్థం చేసుకోలేకపోతున్నారు. పైగా ఆ విధమైన ప్రవర్తనకు ‘‘ఎక్స్‌ట్రాలు, ఓవర్, డ్రామాలు, మైండ్ గేమ్’’ అని పేర్లు పెడుతుంటారు. ఫైనల్‌గా అమ్మాయిల్లోని అటెన్షన్ సీకింగ్‌ను ఎదుటి వ్యక్తులు అర్థం చేసుకోకపోవడంవల్ల అపార్థాలకు, అనుమానాలకు, అవమానాలకు దారితీస్తుందని రెండు వేలమందిపై నిర్వహించిన యూగోవ్ సర్వేలోనూ వెల్లడైంది. అంటే ఇక్కడ పితృస్వామ్య భావజాలం, మూసధోరణు కలిగిన ప్రజలు సహాయం కోరిన స్త్రీలను అర్థం చేసుకోవడానికి బదులు ‘చాలు డ్రామాలు’ అంటూ అవమానించేలా చేస్తాయి.

నిజాయితీ పరులే బాధితులుగా..

సమాజంలో ఎంతో మార్పు వచ్చిందని చెప్తుంటాం. వింటుంటాం..కానీ ఆధునికత ఆకాశమంత ఎదిగినా అమ్మాయిలను అర్థం చేసుకునే విషయంలో మాత్రం మనం పాతాళానికి పడిపోతున్నట్లు వాస్తవ పరిస్థితులు అద్దం పడుతున్నాయి. ఆయా సందర్భాల్లో యువతులు ఎదుర్కొంటున్న అవమానాలు, ఏదో ఒక పేరుతో వారిపై మోపబడుతున్న నిందలు ఇలాంటి కోవకే చెందుతాయి. అయినప్పటికీ యువతులు తమ మనసులోని మాటను, అవమానాన్ని బయటకు చెప్పలేని పరిస్థితులు కూడా ఉంటాయి. ఎందుకంటే వారు ధైర్యం చేసి తమ బాధలు లేదా పర్సనల్ విషయాలు చెప్పుకుంటే సమాజం రెస్పాండ్ అయ్యే తీరు చాలా వరకు వారికి వ్యతిరేకంగానే ఉంటుంది. అర్థం చేసుకోవడానికి బదులు ‘చాలు నీ నాటకాలు’ అంటూ అవమానించడమో, సమస్యను జర్నలైజ్ చేయడమో ఇందుకు కారణమని తాజా అధ్యయనం స్పష్టం చేసింది.

టార్గెట్ చేయబడుతున్న సందర్భాలు

చాలా వరకు అమ్మాయిలు తమ ఆరోగ్యం, ప్రేమ, ఎదుర్కొన్న అవమానం, వ్యక్తిగత సమస్య గురించి నలుగురిలో లేదా ఎదుటి వ్యక్తితో చెప్పుకోవడానికి ఇష్టపడరు. ఒకవేళ యువతులు అలా చెప్తున్నారంటే ఎదుటి వ్యక్తుల్ని బాగా నమ్మారు అని అర్థం. కానీ ఇక్కడే వారిని ఈ పురుషాధిక్య ప్రపంచం వారిని తప్పుగా అర్థం చేసుకుంటోందని, వారి అటెన్షన్ సీకింగ్ బిహేవియర్‌ను తప్పుగా అర్థం చేసుకొని దుష్ప్రచారం చేయడం మొదలు పెడతారని, చాలా సందర్భాల్లో వారు నాటకీయంగా టార్గెట్ చేయబడతారని నిపుణులు చెప్తున్నారు. అందుకే ఎటువంటి సందర్భాల్లో అయినా యువతులు భయపడకుండా ధైర్యంగా ఎదుర్కోవాలని సూచిస్తున్నారు.



Source link

Related posts

Justin Bieber: ‘అంబానీ’ సంగీత్ వేడుకల్లో జస్టిన్ బీబర్.. ప్రదర్శనకు రూ. 83 కోట్లు రెమ్యూనరేషన్ అంట!

Oknews

కీళ్ల నొప్పులు ఉన్నవారు ఈ పొరపాట్లు చేయకండి..?

Oknews

షాప్‌కి కస్టమర్‌లు రావడం లేదా.. ఈ ఎఫెక్టివ్ టిప్స్ ని ట్రై చేయండి..

Oknews

Leave a Comment