Top Stories

అమ్మ, అమ్మమ్మల కాలం నాటి గ్లామర్ టిప్స్ నావి


హీరోయిన్లంతా తమ అందాన్ని మెరుగుపరుచునేందురు రకరకాల ప్రొడెక్టులు వాడుతుంటారు. కొంతమంది హీరోయిన్లు ప్రత్యేకంగా విదేశాల నుంచి మరీ కాస్మొటిక్స్ తెప్పించుకుంటారు. కానీ నయనతార మాత్రం రివర్స్ లో వెళ్తోంది. తను పాటించే గ్లామర్ టిప్స్ అన్నీ అమ్మ, అమ్మమ్మల నుంచి నేర్చుకున్నానని చెబుతోంది.

"స్కిన్‌ కేర్‌ పై నాకున్న అవగాహన మొత్తం అమ్మ, అమ్మమ్మ నుంచి వచ్చింది. వాళ్లిద్దరే నాకు చాలా చిట్కాలు నేర్పించారు. మా కుటుంబంలో ఆ చిట్కాలు, పద్ధతులు తరతరాలుగా పాటిస్తూ వస్తున్నాం. ప్రకృతి సిద్ధమైన పదార్థాలతో చేసిన సహజ సౌందర్య ఉత్పత్తులను ఎక్కువగా వాడుతుంటాను. మన చర్మం ఎంత సహజంగా ఉంటే మనం అంత అందంగా ఉంటామని నేను నమ్ముతాను."

ఇలా తన గ్లామర్ సీక్రెట్ ను బయటపెట్టింది నయనతార. సహజసిద్ధ ఉత్పత్తులతో పాటు.. ధ్యానం చేయడం తన సౌందర్యాన్ని మరింత పెంచుతుందని నయనతార అభిప్రాయపడింది. మానసికంగా మనం సంతోషంగా ఉంటే, ఆ సంతోషం, అందం రూపంలో ముఖంపై ప్రతిబింబిస్తుందని చెబుతోంది.

తాజాగా ఈ ముద్దుగుమ్మ సౌందర్య ఉత్పత్తుల మార్కెట్లోకి ఎంటరైంది. కెమికల్స్ తక్కువగా, ప్రకృతిసిద్ధ పదార్థాలు ఎక్కువగా ఉండేలా తన కాస్మొటిక్స్ తయారయ్యాయని, తను సౌందర్యం కోసం ఎలాంటి పద్థతులు ఫాలో అవుతానో, తమ వినియోగదారులకు కూడా అవే అందిస్తున్నామని చెబుతోంది.



Source link

Related posts

విశాఖ గురించి ఉప రాష్ట్రపతి ఏమన్నారంటే….?

Oknews

అమ్మమ్మ పాత్ర కూడా చేస్తానంటున్న హాట్ లేడీ

Oknews

ఆ పర్వం పూర్తయ్యేదాకా జగన్ కోటరీలో కంగారే!

Oknews

Leave a Comment