అరుణ్ ఆదిత్య, అప్సర రాణి జంటగా వినూత్న సెల్యూలాయిడ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై కృష్ణబాబు దర్శకత్వంలో కొత్త సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం ఫిలింనగర్ దైవ సన్నిధానంలో జరిగింది. జస్ట్ ఎంటర్టైన్మెంట్స్ సమర్పణ. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డైరెక్టర్ వి. సముద్ర తొలిషాట్‌కు గౌరవ దర్శకత్వం వహించగా, ప్రముఖ రైటర్ పరుచూరి గోపాలకృష్ణ హీరోయిన్‌పై క్లాప్ కొట్టారు. తొలిషాట్‌కు సంగీత దర్శకురాలు యం.యం. శ్రీలేఖ కెమెరా స్విచ్చాన్ చేశారు. తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ ఛైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు, మాజీ కార్పొరేటర్ కాజా సూర్యనారాయణ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ కృష్ణబాబు మాట్లాడుతూ.. ”సినిమా ప్రారంభోత్సవం ఒక పండగగా జరగడం సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులకు ధన్యవాదాలు. ఏప్రిల్ 20 నుంచి 10 రోజుల పాటు షెడ్యూల్ చేస్తాం. సబ్జెక్టు బాగా వచ్చింది. అరుణ్ ఆదిత్య – అప్సర రాణి జంటగా చేస్తున్న ఈ సినిమా ఖచ్చితంగా అందరికి నచ్చుతుంది. త్వరలోనే ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేస్తాం.” అన్నారు.
అప్సరరాణి మాట్లాడుతూ… ”మంచి రోజు మంచి సినిమా ప్రారంభమైంది. సంతోషంగా ఉంది. నా కెరీర్‌కు ఈ సినిమా మంచి హెల్ప్ అవుతుందన్న నమ్మకంగా ఉంది. నాకు అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్‌కు, డైరెక్టర్‌కు ధన్యవాదాలు.” అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ యం యం శ్రీలేఖ మాట్లాడుతూ.. “తొలిషాట్‌కు కెమెరా స్విచ్చాన్ చేయడం ఆనందంగా ఉంది. ఈ సినిమా పాటలు చాలా బాగా వచ్చాయి. అందరిని ఆకట్టుకుంటాయి. స్క్రిప్ట్ అద్భుతంగా ఉంది. అందరికి నచ్చుతుంది.” అన్నారు.
ఎగ్జిక్యూటివ్ వెంకటేష్ మాట్లాడుతూ… “ఒక అద్భుతం జరుగుతుందంటే.. పరిస్థితులు కూడా అనుకూలిస్తాయని ఈ సందర్బం రుజువు చేసింది. ఒక టాలెంట్ ఉన్న డైరెక్టర్ ఈ సినిమాను ఒక తపస్సులా చేస్తున్నాడు. కృష్ణబాబు స్క్రిప్టును అద్భుతంగా రెడీ చేశారు. ఈ ప్రాజెక్టును ఎంతో నిజాయితీగా, పర్ఫెక్ట్ గా సిద్ధం చేశారు. హీరో అరుణ్ ఆదిత్య ఈ ప్రాజెక్టుకు దొరికిన ఆణిముత్యం, హీరోయిన్ అప్సర రాణి కూడా నిబద్దతతో, అంకితభావంతో పని చేసే వ్యక్తి. ఆమె డెడికేషన్ ఈ సినిమాకు ఎంతో హెల్ప్ అవుతుంది.” అన్నారు.
రిటైర్డ్ ఐపీఎస్ అధికారి సీఎన్ గోపినాథ్ రెడ్డి మాట్లాడుతూ… చిత్రయూనిట్‌కు బెస్టాఫ్ లక్ చెప్పారు. ఎంతో పట్టుదలతో సినిమా చేస్తున్న చిత్రయూనిట్ విజయం సాధించాలని ఆకాంక్షించారు.
లక్ష్మీ, బేబీ వినూత, ఉదయ్ భాను తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి యం.యం. శ్రీలేఖ సంగీతం అందిస్తుండగా సినిమాటోగ్రాఫర్ గా ఆర్ భాస్కర్, ఆర్ట్ డైరెక్టర్ గా కోటి వ్యవహరిస్తున్నారు.