GossipsLatest News

అర్ధరాత్రి అల్లు అర్జున్ ఇంటి ముందు రచ్చ



Mon 08th Apr 2024 09:57 AM

allu arjun  అర్ధరాత్రి అల్లు అర్జున్ ఇంటి ముందు రచ్చ


Allu Arjun greets a sea of fans outside his home అర్ధరాత్రి అల్లు అర్జున్ ఇంటి ముందు రచ్చ

ఆదివారం అర్ధరాత్రి అల్లు అర్జున్ ఇంటి ముందు ఆయన అభిమానులు రచ్చ రచ్చ చేసారు. అల్లు అర్జున్ కి బర్త్ డే విషెస్ చెప్పేందుకు మిడ్ నైట్ 12 గంటలకి ఫోన్ లైట్స్ వేస్తూ జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసం ముందు అరుపులు కేకలతో హడావిడి చేసారు. అల్లు అర్జున్ కూడా అభిమానుల విషెస్ అందుకోవడానికి బయటికి వచ్చాడు. అల్లు అర్జున్ ని చూసి అభిమానులు ఆనందం వ్యక్తం చేసారు. 

నేడు సోమవారం ఏప్రిల్ 8 అల్లు అర్జున్ పుట్టిన రోజు. అభిమాన హీరోని కలుసుకుని లేదంటే కళ్ళతో చూసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపేందుకు అభిమానులు ఆరాటపడ్డారు. అందుకు నిదర్శనమే ఆయన ఇంటి ముందు భారీ సంఖ్యలో కనిపించిన అభిమానులు. వారంతా అల్లు అర్జున్ ని విష్ చేసునేందుకు పోటీపడ్డారు. ఇక ఆయన బర్త్ డే సందర్భంగా మరికొద్ది సేపట్లో అల్లు అర్జున్ పాన్ ఇండియా ఫిలిం పుష్ప ద రూల్ నుంచి టీజర్ రాబోతుంది. 

అల్లు అర్జున్ గంగమ్మ జాతరలో ఉన్న ఎపిసోడ్ తో టీజర్ కట్ ఉండబోతున్నట్టుగా గత నాలుగు రోజులుగా ప్రీ రిలీజ్ పోస్టర్స్ తోనే క్లూ ఇచ్చుకుంటూ వచ్చారు. పుష్ప టీజర్ కోసం ఆయన అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. 


Allu Arjun greets a sea of fans outside his home:

Pushpa actor Allu Arjun greets a sea of fans outside his home









Source link

Related posts

చిరుకి ఊపిరి సలపడం లేదు

Oknews

CM Revanth Reddy Runamaafi: రైతుల రుణమాఫీపై త్వరలోనే శుభవార్త వింటారన్న సీఎం రేవంత్ రెడ్డి

Oknews

2025 Sankranthi Release Movies Details 2025 సంక్రాంతికి.. ఖర్చీఫ్ వేసిన కింగ్

Oknews

Leave a Comment