Health Care

అలసటను తీర్చే బార్లీ వాటర్.. తాగడంవల్ల కలిగే హెల్త్ బెనిఫిట్స్ ఇవే ..


దిశ, ఫీచర్స్ : సమ్మర్ ప్రారంభంలోనే ఎండలు మండుతున్నాయి. బయట తిరిగొస్తే చాలు చల్లగా ఏవైనా పానీయాలు తీసుకోవాలనిపిస్తుంది ఎవరికైనా. అయితే ఈ సీజన్‌లో ఏవి పడితే అవి తీసుకోవడంవల్ల జీర్ణక్రియ సమస్యలు వస్తాయని, వేడిచేసే అవకాశం ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. అలాంటి ఇబ్బందులేవీ లేకుండా ఉండాలంటే ఆరోగ్యకరమైన పానీయాల్లో బార్లీ వాటర్ కూడా ఒకటని, వేసవిలో తీసుకోవడం మేలు చేస్తుందని చెప్తున్నారు. మరి దీనివల్ల ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయో చూద్దాం.

*బార్లీలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే గట్ బాక్టీరియాను బ్యాలెన్స్ చేయడం ద్వారా జీర్ణాశయాంతర సమస్యలను నివారిస్తుంది. కాబట్టి బార్లీని మిక్స్ చేసిన వాటర్ లేదా జ్యూస్, ఇతర ఆహారాలు తీసుకోవడంవల్ల బాక్టీరాయిడ్స్ అనే గట్ బ్యాక్టీరియా సోకకుండా మేలు జరుగుతుంది.

* హైబీపీని, షుగర్ లెవల్స్‌ను కంట్రోల్ చేయడంలో, టైప్ 2 డయాబెటిస్ రిస్కును తగ్గించడంలో బార్లీ అద్భుతంగా హెల్ప్ అవుతుంది. కాబట్టి మధుమేహ బాధితులు సమ్మర్‌లో బార్లీ వాటర్ తీసుకోవడం మంచిది. అలాగే ఎండవల్ల తగిలే వడదెబ్బ ప్రభావాన్ని కూడా తగ్గిస్తుంది.

* బార్లీ వాటర్ తాగడంవల్ల జీర్ణాశయం క్లీన్ అవుతుంది. అజీర్తి, మలబద్దకం వంటి ప్రాబ్లమ్స్ దూరం అవుతాయి. గర్భిణులు దీనిని తీసుకోవడం చాలామంచిది. కాళ్ల వాపు సమస్య రాకుండా ఉంటుంది. ఉదయం, సాయంత్రం బార్లీ నీళ్లు తాగితే బిడ్డ ఆరోగ్యం కూడా బాగుంటుందని, అలసట దూరం అవుతుందని నిపుణులు చెప్తున్నారు. అలాగే యూరిన్ ఇన్ఫెక్షన్, వివిధ అలెర్జీలను తగ్గించడంలోనూ బార్లీవాటర్ ముఖ్యపాత్ర పోషిస్తుంది.



Source link

Related posts

తెగిన వెంట్రుకల ఖరీదు రూ. 12 లక్షలు.. వేలం పాటలో 1200 మంది పోటీ

Oknews

ఏళ్లనాటి సమాధి.. తవ్వేకొద్దీ బయటపడుతన్న బంగారు నిధి.. ఎక్కడంటే..?

Oknews

టీ తాగేటప్పుడు అదనంగా చక్కెర వేసుకుంటున్నారా?

Oknews

Leave a Comment